Monday, November 25, 2024

నాన్సీ పెలోసీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌.. స‌భ‌కు మ‌ళ్లీ ఎన్నిక అవ్వాల‌ని లేదు

త‌న‌కు..డెమొక్ర‌టిక్ కాంగ్రెస్ కి కొత్త త‌రం నాయ‌క‌త్వం వ‌హించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అమెరికా ప్ర‌తినిధుల స‌భ స్పీక‌ర్ నాన్సీ పెలోసీ అన్నారు. ఈ మేర‌కు ఆమె సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సభకు మళ్లీ ఎన్నికవాలని లేదని మనసులో మాటను బయటపెట్టారు. చాంబర్‌కు నాయకత్వం వహించిన తొలి మహిళగా రికార్డులకెక్కిన 82 ఏళ్ల నాన్సీ.. రెండు దశాబ్దాల తర్వాత తప్పుకుంటుండడం గమనార్హం.

మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు స్వల్ప మెజారిటీతో విజయం సాధించిన నేపథ్యంలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. శాన్‌ఫ్రాన్సిస్కోకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాన్సీ.. పదవి నుంచి తప్పుకుంటున్నప్పటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని, ప్రస్తుత ఎన్నిక పదవీకాలాన్ని పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. హౌస్‌లో 14 నిమిషాల ప్రసంగంలో ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. సభ్యులపై తనకు ఎంతో నమ్మకం ఉందని, కాబట్టి తర్వాతి కాంగ్రెస్‌లో డెమొక్రటిక్ నాయకత్వాన్ని తిరిగి కోరుకోవడం లేదని అన్నారు. ఆమె ప్రసంగానికి సభ్యుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. చప్పట్లతో సభ మార్మోగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement