మాజీ ఎంపీ రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి తమ తండ్రి రాజీవ్ గాంధీ సమాధి వద్దపుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ‘నానా మీ జ్ఞాపకాలు ఎల్లప్పుడూ నాతో ఉంటాయి. మీరే నాకు స్ఫూర్తిప్రధాత’ అని రాహుల్ గాంధీ హిందీలో ఎమోషనల్ ట్వీట్ చేశారు. 1944, ఆగస్టు 20న జన్మించిన రాజీవ్ గాంధీ.. 1984లో తన తల్లి ఇందిరా గాంధీ మరణానంతరం దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో 40 ఏండ్ల వయస్సులోనే ప్రధాని అయిన తొలి వ్యక్తిగా గుర్తింపుపొందారు.
1989, డిసెంబర్ 2వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. 1991, మే 21న ఎన్నికల ప్రచారం సందర్భంగా తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌లో నిర్వహించిన సభలో ఎల్టీటీఈ ఉగ్రవాదులు చేతిలో దారుణ హత్యకుగురయ్యారు.మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ నివాళులు అర్పించారు. న్యూఢిల్లీలోని వీర్ భూమీలో ఉన్న ఆయన సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. సోనియాతోపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికర్జున ఖర్గే కూడా రాజీవ్‌కు నివాళులర్పించారు.