Tuesday, November 26, 2024

RTC బస్సులను కించపరుస్తారా?: ర్యాపిడోపై కోర్టు ఆగ్రహం

ర్యాపిడో యాడ్‌లో ఆర్టీసీ బస్సులను తక్కువ చేసి చూపించడం, కించపరచడాన్ని నాంపల్లిలోని సిటీ సివిల్ కోర్టు కూడా తప్పుపట్టింది. వాణిజ్య పరువును దెబ్బతీస్తున్నందునా ఆ యాడ్ లో టి.ఎస్.ఆర్టీసీని తొలగించాలని ర్యాపిడోతో పాటు గూగూల్ యూట్యూబ్ లకు కోర్టు ఆదేశించింది. యాప్ ఆధారిత బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ ర్యాపిడో టి.ఎస్.ఆర్టీసీకి సేవలకు భంగం కల్గిస్తూ రూపొందించిన విషయంపై పలు విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ నటించిన వాణిజ్య ప్రకటనను ప్రసారం, ప్రచారం చేయకుండా నిరోధించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

నాంపల్లిలోని సిటీ సివిల్ కోర్టులోని 10వ జూనియర్ సివిల్ జడ్జి ర్యాపిడో, కంపెనీ వారసులు, డైరెక్టర్లు, ఉద్యోగులు, సేవకులు, ఏజెంట్లు, ప్రతినిధులు, టెలికేటింగ్, ప్రసారం, స్ట్రీమింగ్, పునరుత్పత్తి,యాడ్ ఫిల్మ్‌ల యొక్క ‘అసలు, సవరించిన’ వెర్షన్‌లను వారి వెబ్‌సైట్‌లలో లేదా ఇంటర్నెట్ ద్వారా ఏ పద్ధతిలోనైనా ప్రజలకు పంపిణీ చేయడం, అందుబాటులో ఉంచడం, ప్రజలకు కమ్యూనికేట్ చేయడం వంటి అంశాలతో పాటు ప్రభుత్వ యాజమాన్యంలోని టిఎస్‌ఆర్‌టిసి నడుపుతున్న బస్సు సర్వీసులకు వాణిజ్య పరువు నష్టంకు సంబందించిన విషయాలపై విచారించారు. వాణిజ్య వీడియో యొక్క అసలైన,సవరించిన సంస్కరణకు యాక్సెస్‌ను బ్లాక్ చేయాలని గూగూల్ యొక్క ఆన్‌లైన్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ ని ధర్మాసనం ఆదేశించింది.

గత నెల రోజులుగా ర్యాపిడో విస్తృతంగా ప్రకటనలను ప్రసారం చేస్తోంది. ఇందులో నటుడు అల్లు అర్జున్ టి.ఎస్.ఆర్టీసీ బస్సులలో ప్రయాణించడం అసౌకర్యం, ప్రమాదకరమని వాణిజ్య ప్రకటన సూచించడం కోసం ర్యాపిడో ద్వారా అద్దెకు తీసుకున్న టి.ఎస్.ఆర్టీసీ  బస్సును నేరుగా చూపించడం కనిపించింది. టి.ఎస్.ఆర్టీసీ నోటీసు జారీ చేసిన తరువాత, ర్యాపిడో యాడ్ ఫిల్మ్‌లను కొద్దిగా సవరించింది కానీ టి.ఎస్.ఆర్టీసీ బస్సును ప్రదర్శించడం కొనసాగించింది. ఈ విషయంపై అభ్యంతరం చెప్పనప్పటికీ వివిధ ఛానెల్లో, యూట్యూబ్‌లలో ప్రకటనలను ప్రసారం చేయడాన్ని నిలిపివేయడానికి నిరాకరించడంతో టి.ఎస్.ఆర్టీసీ కోర్టును ఆశ్రయించింది.

ర్యాపిడో వాటి సేవలను ప్రోత్సహించడానికి ఖచ్చితంగా అర్హత కలిగి ఉన్నప్పటికీ,  ప్రజా రవాణా సంస్థ అయిన టి.ఎస్.ఆర్టీసీకి పరువు నష్టం కలిగించే విధంగా ప్రకటనలు చేయడం తగదని సంస్థ తరపున సీనియర్ న్యాయవాది కె. వివేక్ రెడ్డి వాదించారు. TSRTC ప్రయాణీకుల భద్రత కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటుందని, అయితే ఇలాంటి ప్రకటన ద్వారా తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ప్రభుత్వ రంగ సంస్థను కించపరిచే విధంగా ప్రకటనలు చేయడం చట్టవిరుద్ధం అంటూ తన వాదనను బలంగా వినిపించారు.

వాదనల తరువాత కోర్టు పరువు నష్టం కలిగించే ప్రకటన చిత్రాలను ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలని ర్యాపిడోని ఆదేశించింది. అలాగే, యూట్యూబ్ తన ప్లాట్‌ఫారమ్ నుంచి పరువు నష్టం కలిగించే ప్రకటన చిత్రాలను తీసివేయాలని కూడా సూచించింది. కోర్టు ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లు తేలితే వారు ప్రాసిక్యూట్ చేయబడతారని హెచ్చరించింది.

- Advertisement -

ప్రతిరోజు లక్షలాది మంది ప్రజల రవాణా అవసరాలను తీర్చే దశాబ్దాల నాటి ప్రభుత్వ సంస్థ అయిన టి.ఎస్.ఆర్టీసీని బలోపేతం చేయాలని సాధారణ ప్రజలకు RTC ఎంపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. సంస్థను సామాజిక ఆస్తిగా భావించడమే కాక ప్రతి ఒక్కరూ ఆదరించాలి తప్ప సంస్థ ప్రతిష్ఠతకు భంగం కల్గించకూడదని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement