Monday, November 25, 2024

ఎమ్మెల్సీ ఎన్నికలు.. మూడో రౌండ్ పూర్తి

నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం మూడో రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. మూడో రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 15,558 ఓట్లతో తొలి స్థానంలో ఉండగా.. తీన్మార్ మల్లన్న 10,748 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక 11,302 ఓట్లతో ప్రొఫెసర్ కోదండరాం మూడో స్థానంలో ఉన్నారు. మూడు రౌండ్లు కలిపి పల్లాకు 12,142 ఓట్ల ఆధిక్యం వచ్చింది. మొత్తం పల్లాకు 47,545 ఓట్లు, మల్లన్నకు 34,864 ఓట్లు, కోదండరాంకు 29,560 ఓట్లు వచ్చాయి. ఇంకా నాలుగు రౌండ్లు మిగిలి ఉండటంతో.. ఎవరు గెలుస్తారనేది సస్పెన్స్‌గా మారింది.

ఇక రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి వాణీదేవి, బీజేపీ అభ్య‌ర్థి రాంచంద‌ర్ రావు మధ్య పోటీ నెల‌కొంది. మూడో స్థానంలో స్వ‌తంత్ర అభ్య‌ర్థి ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ కొన‌సాగుతున్నారు. రెండో రౌండ్‌ పూర్తయ్యే సరికి సురభి వాణీ దేవికి  13,395 ఓట్లు రాగా, రాంచంద‌ర్‌ రావు‌కు 12,223 ఓట్లు వ‌చ్చాయి. ఆయ‌న త‌ర్వాతి స్థానాల్లో వ‌రుస‌గా నాగేశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి, టీడీపీ అభ్యర్థి రమణ కొన‌సాగుతున్నారు. ప్ర‌స్తుతం మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. మూడు రౌండ్లలో భారీగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ప్రతీ రౌండ్‌లో 3 వేల పైచిలుకు చెల్లని ఓట్లే ఉన్నట్లు తెలుస్తోంది. మూడు రౌండ్లలో 9,252 చెల్లని ఓట్లు నమోదయినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement