Thursday, November 21, 2024

21న నాగోబా జాత‌ర ప్రారంభం…..

గోదావరి జలాలతో నడక ప్రారంభించిన గిరిజనులు
17న ఇంద్రావతి దేవీ పూజలు
జాతర ఏర్పాట్లలో ప్రభుత్వం
సరిహద్దు జిల్లాలతో పాటుగా ఉత్తరాది నుంచి జాతరకు రానున్న గిరిజనులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: విష స్థితి గల భుజంగాలను పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. జ్ఞానం, బలం, పునరుత్పాదనకు చిహ్నంగా భావించే నాగులను పూజించ డం భారతదేశంలో వేలాది సంవత్సరాలుగా జీవంపోసు కున్న సంస్కృతి. భారతపురాణ, హితిహాసాల్లో నాగులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. సింధులోయ నాగరికత. బౌద్ధ మతంలో నాగ సర్పాలకు విశేష ప్రాధాన్యత ఉంది. అందుకే దేశాన్ని కర్మభూమి, నాగభూమి అని సంబోధిస్తుంటారు. అయితే తరాలుమారినా, ఆధునిక సాంకేతిక విప్లవం కొనసాగుతున్నా నాగులకు గుళ్లు కట్టి పూజించే ఆచారం నేటికీ ఉంది. ప్రధానంగా గిరిజనులు నాగదేవతను కుల దైవంగా ఆచరించడంతో పాటు ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతర చేయడం తెలంగాణకే సొంతం. దట్టమైన అడవి ప్రాంతం, పీపుల్స్‌ వార్‌ ఉద్యమాలకు ఒకప్పటి రణ క్షేత్రం ఇంద్రవెల్లి లో నిర్వహించే నాగోబా జాతర ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర. ఈ పండుగను రాష్ట్ర పండుగగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించి ఏర్పాట్లు చేస్తుండటంతో గిరిజనులు మరింత ఉత్సాహంతో జాతరఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

నాగోబా జాతర నిర్వహణలో అత్యంత క్రమశిక్షణ, నిష్ఠతో చేయాల్సిన సంప్రదాయ క్రతువులు అనేకం ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుులు లేకుండా 250 కిలో మీటర్లు ప్రయాణించి గంగాజలం(ఉత్తర తెలంగాణలో గోదావరిని గంగా భావిస్తుంటారు)తీసుకువచ్చి నాగోబా ఆలయంలోని నాగదేవతను అభిషేకించడం. ప్రస్తుతం ఈ తంతు కొనసాగుతోంది. గోదావరి జలాలను తీసుకు వచ్చేందుకు 151 మంది మోస్త్రం వంశస్తులు బయలుదేరి మంచిర్యాల జిల్లా కలమడుగు నుంచి జలాలను ఆదిలా బాద్‌ జిల్లాలోని కేస్తాపూర్‌కు తీసకువెళ్తున్నారు. జనవరి 21న నాగోబా దేవుడికి ఈ జలాలతో అభిషేకించి మహాపూజ చేసి నాగోబా జాతరను ప్రారంభిస్తారు. కేస్లాపూర్‌ నుంచి 151 మంది మోస్త్రం వంశస్తులు గంగాజలం కోసం 5మండ లాలు, 22 మారుమూల గ్రామాల మీదుగాపాదయాత్ర కొనసాగించి జన్నారం మండలంలోని కలమడుగు ప్రాంతానికి చేరుకున్నారు. తిరుగుప్రయాణం చేసి జనవరి 17న ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవికి పూజచేస్తారు. అనంతరం జనవరి 21 రాత్రి 10 గంటలకు గంగాజలంతో నాగోబా దేవుడికి అభిషేకం నిర్వహించి మహాజాతర ప్రారంభిస్తారు. నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్ర వెంకటరావు, పూజారి కోసు ప్రధాన్‌ దాదేరావు ఆధ్వర్యంలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సమ్మక్క సారక్క జాతర అనంతరం అతిపెద్ద జాతర నాగోబా జాతర. ఇక్కడ నాగదేవ తలు పూజలందు కుంటాయి. ఈ జాతరకు ఛత్గిdస్‌గఢ్‌, రాజస్తాన్‌, హిమాలయ ప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వేలాది మంది గిరిజనులు పాల్గొంటారు.
తెలంగాణలో ప్రతిసంవత్సరం ఘనంగా నిర్వహించే నాగోబా జాతరను ఆదివాసీలు అత్యంతపవిత్రంగా నిర్వహి స్తారు. ప్రతి సంవత్సరం ఈ పండుగసందర్భంగా ప్రపంచ శాంతికోసం నవ్వుల నూనె తాగడం ఇక్కడ ఆనవాయితీ. ఆదివాసీ తొడం వంశీయుల ఆడపడుచు మెస్త్రం నాగుబా యు 2.5 కిలోల నువ్వుల నూనె తాగారు. ప్రతి ఏడాది పుష్ప మాసంలో ఖాందేవునికి మహా పూజ నిర్వహించి నూనెతా గడం ఆనవాయితీగావస్తుంది.అలాగే గిరిజన పోరాటాలు, నృత్యాలు ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వారంరోజులపాటు జరిగే ఈ జాతరకు అత్యధికంగా గిరిజనులు తరలి వస్తున్నారు. మాెెస్త్రం వంశీయులు తరతరాల నుంచి నిర్వహించే నాగోబా జాతరను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే గిరిజనులకు ఏర్పాట్లు, వాహనాలు వెళ్లేందుకు రహదారులను నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement