Saturday, November 23, 2024

నాగార్జున సాగర్ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తివేత..

నాగార్జున సాగర్ జలాశయం ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా… ఇప్పటికే 585 అడగులకు ఆ నీటిమట్టం చేరింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా… ఇప్పటికే 300 టీఎంసీల నీటితో ప్రాజెక్టు నిండు కుండలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు సాగర్ 14 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. గేట్లు తెరుచుకోవడంతో సాగర్ లో పర్యాటకుల సందడి నెలకొన్నది. పెద్ద సంఖ్యలో పర్యాటక ప్రేమికులు ప్రాజెక్టు వద్దకు చేరుకొని కృష్ణమ్మ సోయగలను ఆస్వాదిస్తున్నారు. పర్యటకులతో సాగర్ ప్రాంత పరిసరాలు కోలాహలంగా మారాయి.

గేట్లు ఎత్తివేయడంతో ఆ దృశ్యాన్ని చూసేందుకు చాలామంది పర్యాటకులు ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. మరోవైపు కృష్ణా దిగువ ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఇప్పటికే అలర్ట్ చేశారు. నదిలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. గతేడాది పోలిస్తే ఈ ఏడాది 20 రోజులు ముందుగానే ప్రాజెక్టులో పూర్తి స్థాయికి నీటి మట్టం చేరుకోవడం గమనార్హం. ఎగువన కర్ణాటకలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి,జూరాల,నారాయణపూర్ ప్రాజెక్టులు నిండటంతో ఆ నీటిని కిందకు వదులుతున్నారు. దీంతో సాగర్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం సాగర్ ఇన్‌ఫ్లో 5.14లక్షల క్యూసెక్కులుగా ఉంది.

ఇది కూడా చదవండి: Telangana cabinet: పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

Advertisement

తాజా వార్తలు

Advertisement