తెలంగాణ ప్రజలు అంతా ఆసక్తిగా గమనిస్తోన్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది… దీంతో తెలంగాణ భవన్ లో అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సంబరాలు ప్రారంభమయ్యాయి.
ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో ప్రతీ రౌండ్‌లోనూ టీఆరెఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.. ప్రతీ రౌండ్‌కు టీఆర్ఎస్ ఆధిక్యం పెరుగుతూనే ఉంది.. కాంగ్రెస్‌కు పట్టుఉన్న మండలాల్లో సైతం టీఆర్ఎస్‌కు ఎక్కువ ఓట్లు రావడంతో.. కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.. ఇక, ఎనిమిదో రౌండ్‌లోనూ టీఆర్ఎస్‌కు ఆధిక్యం లభించింది.. ఒక పదో రౌండ్ లెక్కింపులో మాత్రమే కాంగ్రెస్ ఆధిక్యంలో నిలిచింది. ఈ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఓ రౌండ్‌లో ఆధిక్యంలో నిలవడం ఇదే తొలిసారి. పదో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జానా రెడ్డికి 3,166 ఓట్లు పడ్డాయి. తెరాస అభ్యర్థి నోముల భగత్‌కు 2,991 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ రౌండ్‌లో కాంగ్రెస్ 175 ఓట్ల ఆధిక్యంలో నిలిచింది.