Friday, November 22, 2024

ఆసక్తిగా మారిన ‘సాగర్’ రాజకీయం

తెలంగాణలో నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రజలందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఎన్నికలు అన్న తర్వాత ఎవరు గెలుస్తారా అని ఎదురుచూడటం సర్వసాధారణమే. కానీ ఇక్కడ ఒక పార్టీలో తాత వయసు వ్యక్తి పోటీ చేస్తుంటే అతడితో మనవడు వయసు వ్యక్తి మరో పార్టీ నుంచి పోటీ చేయడమే ఇక్కడ ఆసక్తికరంగా మారింది.

ఇక అసలు విషయానికి వస్తే.. సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ రాజకీయ నేత జానారెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనకు 74 ఏళ్ల వయసు ఉంటుంది. వయసు పెద్దదైనా జానారెడ్డి రాజకీయాల్లో తల పండిన వ్యక్తి. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ స్వయంగా జానారెడ్డి గారూ అని సంభోధిస్తూ ఆయన్ను సలహాలు అడుగుతుంటారు కూడా. అయితే జానారెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ ఓ కుర్రాడిని రంగంలోకి దించుతుండటమే విశేషం. నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌కు టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. నోముల భగత్ లాయర్ చదువుకున్న వ్యక్తి. అంతేకాకుండా తండ్రి కోసం నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశాడంటూ పేరు కూడా ఉంది. దీంతో సాగర్ ఉప ఎన్నికలో తాత గెలుస్తాడా? మనవడు గెలుస్తాడా? అని సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement