Thursday, November 7, 2024

‘సాగర్’ దంగల్ షురూ…

తెలంగాణలో ఉత్కంఠరేపుతున్న నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ కట్టారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3 వేల 145 మంది సిబ్బంది సేవలందిస్తుండగా… కేంద్ర, రాష్ట్ర బలగాలతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా దృష్ట్యా ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. కొవిడ్ నిబంధనల మేరకు… నాగార్జునసాగర్​ ఉపఎన్నిక పోలింగ్ జరిగేలా ఈసీ జాగ్రత్తలు తీసుకుంటోంది. నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గానికి జరగనున్న పోలింగ్ కోసం… అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓటు వేసేందుకు వచ్చే వారికి గ్లవ్స్, శానిటైజర్ అందజేశారు.

ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు… పోలింగ్ కొనసాగనుంది. 2 లక్షల 20 వేల 3 వందల మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం పరిధిలో… అనుముల, పెద్దవూర, గుర్రంపోడు, నిడమనూరు, త్రిపురారం, తిరుమలగిరి, మాడుగులపల్లి మండలాలు ఉన్నాయి. మొత్తం 41 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా… టిఆర్ఎస్ నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, బిజెపి తరఫున రవికుమార్ బరిలో ఉన్నారు. 1,038 బ్యాలెట్ యూనిట్లు, 346 కంట్రోల్ యూనిట్లు, 346 వీవీప్యాట్లను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. 108 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో… ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement