నాగాలాండ్ లో కూడా పితృస్వామ్యం అధికంగా ఉంటుందని అయితే పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే మార్పులు వస్తున్నాయని తెలిపారు నాగాలాండ్ నుంచి ఫస్ట్ టైం రాజ్యసభకు నామినేట్ అయిన ఫాంగ్నాన్ కొన్యాక్.. మహిళలు కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారన్నారు. 45 ఏళ్ల తరువాత పార్లమెంట్ కు వెళ్తున్న మహిళగా ఫాంగ్నాన్ కొన్యాక్ చరిత్ర సృష్టించారు. 1977లో చివరి సారిగా ఓ మహిళ లోక్ సభలో అడుగుపెట్టారు. తరువాత నుంచి ఇప్పటి వరకు ఎవరూ నాగాలాండ్ నుంచి లోక్ సభలోగానీ, రాజ్యసభలో సభ్యులుగా లేరు. నాగాలాండ్ అసెంబ్లీలో ఇప్పటి వరకు ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేరు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు మహిళలు పోటీ చేసినప్పటికీ, అక్కడ మహిళలకు తక్కువ ప్రియారిటీ ఉంటుంది కాబట్టి వారు విజయం సాధించలేదు. అయితే మొదటి సారిగా నాగాలాండ్ బీజేపీ ఓ మహిళలను రాజ్యసభకు పంపిస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement