Saturday, November 23, 2024

Naga Chaitanya: హీరో నాగ చైతన్యకు షాక్.. జరిమానా విధించిన పోలీసులు

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్యకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు  జరిమానా విధించారు. జూబ్లీహిల్స్‌లో తనిఖీల సందర్భంగా నాగ చైతన్య కారును ఆపిన పోలీసులు.. కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్‌తో తిరుగుతున్నందుకు రూ.700 చలానా విధించారు. ఆ సమయంలో నాగ చైతన్య కారులోనే ఉన్నారు.

కాగా, గత కొద్ది రోజులుగా ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సెలబ్రిటీలకు వరుసపెట్టి జరిమానాలు విధిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్, కల్యాణ్ రామ్‌‌లకు కూడా బ్లాక్ ఫిల్మ్ కారణంగా ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. గత వారం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కారుకు బ్లాక్‌ ఫిల్మ్‌తో వెళ్తుండగా ఆయన వాహనాన్ని ఆపి జరిమానా విధించారు. కాగా, కేవలం ‘వై’ కేటగిరీ భద్రత ఉన్నవారికి మాత్రమే బ్లాక్ ఫిల్మ్ నుంచి మినహాయింపు ఉంది. ఈ మేరకు గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలను ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement