Friday, November 22, 2024

14 ఏళ్ల బాలిక గ్యాంగ్​రేప్​, మర్డర్​ కేసులో పురోగతి.. సీబీఐ కస్టడీలోకి నిందితులు

బెంగాల్​లో ఈ మధ్య జరిగిన ఓ 14 ఏళ్ల బాలిక గ్యాంగ్​రేప్​, మర్డర్​ కేసులో నిందితులను సీబీఐ కస్టడీకి ఇవ్వాలని దాఖలైన పిటిషన్​పై కోర్టు స్పందించింది. హన్స్ ఖాలీ గ్యాంగ్‌రేప్ కేసులో అరెస్టయిన రంజిత్ మల్లిక్‌ను 12 రోజుల సీబీఐ కస్టడీకి రణాఘాట్ సబ్ డివిజనల్ కోర్టు ఆదేశించింది. నదియా అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరిని ఆదివారం రణఘాట్ కోర్టులో హాజరుపరిచారు. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలోని హన్స్ ఖాలీ ప్రాంతంలో స్థానిక TMC నాయకుడి కుమారుడి పుట్టినరోజు వేడుకలో 14 ఏళ్ల బాలికపై ఏప్రిల్ 9 న అత్యాచారం జరిగింది.  ఈ అఘాయిత్యంతో ఆ బాలిక మృతి చెందింది. కాగా, దీనిపై సీబీఐ న్యాయవాది 14 రోజుల రిమాండ్‌ను కోరారు.  

అయితే 12 రోజుల దరఖాస్తును న్యాయమూర్తి ఆమోదించారు. బాధిత కుటుంబాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎండీ సామిల్ ఆదివారం కలిశారు. అత్యాచారం కేసుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీపైన ఆయన విరుచుకుపడ్డారు. “మమతా బెనర్జీ బాలికను నిందించారని, దేశవ్యాప్తంగా ఇదే జరుగుతోంది. అందరూ బాధితురాలి పాత్ర ఏంటి.. అని మాత్రమే చూస్తున్నారు” అని అన్నారు. అయితే.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గ్యాంగ్ రేప్ కేసుపై పలు అనుమానాలను లేవనెత్తారు. “అది రేప్ కాదా? లేక ఎఫైర్ తర్వాత ఆమె గర్భవతి అయ్యిందా? అని వ్యాఖ్యానించారు. కాగా, ఏప్రిల్‌ 5న బాలిక చనిపోయింది.. ఏప్రిల్‌ 10న పోలీసులకు తెలిసింది.. ఏప్రిల్‌ 5న ఆమె చనిపోయి ఉంటే, ఫిర్యాదు చేస్తే ఘటన జరిగిన రోజు పోలీసుల వద్దకు ఎందుకు వెళ్లలేదని సీఎం అన్నారు. వారు మృతదేహాన్ని దహనం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement