Tuesday, November 19, 2024

హైటెక్‌ సిటీలో న్యాక్‌ వర్సిటీ.. నిర్మాణ రంగంలో యూత్ కి ట్రైనింగ్.. ఉఫాధి కల్పన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: హైటెక్‌ సిటీలోని న్యాక్‌ (నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌)లో త్వరలో కన్‌స్ట్రక్షన్‌ యూని వర్సిటీ రాబోతోంది. దీనికి సంబంధిం చిన విధివిధానాలు రూపొందించేందు కు ప్రభుత్వం ఒక కమిటీని వేస్తూ జీవోను విడుదల చేసింది. స్థల పరిశీలన, కోర్సు లు, శిక్షణ తదితర అంశాలపైన ఈ కమిటీ రూపొందించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకో నుంది. నిర్మాణ రంగంలో మానవవనరులను అభివృద్ధిపరిచేలా నిరుద్యోగ యువతకు ఉద్యోగవకాశాలు కల్పించేందుకు గానూ కన్‌స్ట్రక్షన్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు గతంలో ప్రభుత్వానికి అందాయి. ఇందులో భాగంగానే గతేడాది నవంబర్‌ 27న జరిగిన న్యాక్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలోనూ రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వర్సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే వర్సిటీ ఏర్పాటుకు కావాల్సిన విధివిధానాలు రూపొందించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ఆర్‌అండ్‌బీ శాఖ జీవోను విడుదల చేసింది. ఈ కమిటీలో చౖైెర్మన్‌గా ట్రాన్స్‌పోర్ట్‌ రోడ్లు-భవనాల శాఖ కార్యదర్శి, కన్వీనర్‌గా న్యాక్‌ డైరెక్టర్‌ జనరల్‌, మెంబర్లుగా మరో ముగ్గురు ఉన్నారు. అయితే కోర్సులు, కాలపరిమితి, అకాడమిక్‌ క్యాలెండర్‌, శిక్షణ, వర్సిటీ ఏర్పాటు తదితర అంశాలతో కూడిన నివేదికను రూపొందించేందుకు ఉన్నత విద్యా మండలి సహాయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను న్యాక్‌ కల్పిస్తున్నది. గతేడాది 19 వేల మందికి శిక్షణ ఇచ్చి ఉద్యగోవకాశాలు కల్పించింది. బీటెక్‌ చదివిన వారికి న్యాక్‌ ఆధ్వర్యంలో ఒక ఏడాది పీజీ విద్యతో పాటు ఇతర విద్యార్హతతో మరికొన్ని కోర్సులను అందించే విషయాన్ని అధికారులు పరిశీలించనున్నారు. ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది నుంచి ఈ యూనివర్సిటీ అందుబాటులోకి రానున్నట్లు ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement