ఓ కానిస్టేబుల్ నాగిన్ డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. యూపీలోని కొత్వాలి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో ట్విటర్‌లో అప్‌లోడ్ చేశారు. దీంట్లో పోలీసు అధికారులు బ్యాండ్ చప్పుళ్లకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారు. సబ్-ఇన్‌స్పెక్టర్ ట్రంపెట్‌ను నాదస్వరంలా వాయిస్తుంటే.. కానిస్టేబుల్ “నాగిన్” నృత్యం చేశాడు. వీరిద్దరినీ చుట్టూ ఉన్న మిగతా పోలీసులు చప్పట్లతో హుషారెక్కించారు.ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే దీనికి 74,000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఇలాంటి వాటివల్ల పోలీసులు ఒత్తిడి నుంచి బాగా రిలీఫ్ పొందుతారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది వారిని ఉత్సాహంగా ఉంచడమే కాకుండా.. వారిమధ్య అనుబంధాన్ని పెంచుతుందన్నారు. నిజానికి, నాగిన్ డ్యాన్స్ వేయకుండా ఎవ్వరినీ ఆపలేం.. ఆ మ్యూజిక్ వచ్చిందంటే చాలు కాలు దానంతట అదే కదులుతుంది. అంటూ డ్యాన్స్ చేసిన పోలీసులను ట్విట్టర్ యూజర్ ఒకరు అభినందించారు. మరికొందరు ఈ పోలీసులను మల్టీ టాలెంటెడ్ అని కొనియాడారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement