Sunday, September 8, 2024

మ‌య‌న్మార్ ప్ర‌జాస్వామ్యనేత అంగ్ సాన్ సూకీకి .. నాలుగేళ్ళ జైలు శిక్ష ..

నోబెల్ శాంతి గ్ర‌హీత , మ‌య‌న్మార్ ప్రజాస్వామ్య నేత అంగ్ సాన్ సూకీకి అక్క‌డి కోర్టు నాలుగు సంవ‌త్స‌రాల జైలు శిక్ష‌ని కోర్టు విధించింది. ప్ర‌కృతి వైప‌రీత్యాల చ‌ట్టం ఉల్లంఘ‌న , హింస‌కు ప్రేరేపించ‌డం వంటి అంశాల్లో సూకీపై 11కేసులు ఉన్నాయి. కాగా వీటిలో కొన్ని కేసుల్లో దోషిగా చాలా కాలం జైల్లో ఉండాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి మయన్మార్‌ ప్రభుత్వాన్ని నడుపుతున్న అంగ్ సాన్ సూకీ, ప్రభుత్వాన్ని సైనిక తిరుగుబాటు ద్వారా కూల్చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు అధికారికంగా కోర్టు ద్వారా శిక్షించారు.. మయన్మార్‌ను కొన్ని దశాబ్దాల పాటు పాలించిన కఠినమైన సైనికాధికారులను అంగ్ సాన్ సూకీ సవాల్ చేశారు.

ఆమె దీర్ఘ కాలం హౌస్‌ అరెస్ట్ లోనే ఉన్నారు. సూకీ 1989 – 2010 వరకు నిర్బంధంలోనే గడిపారు. సైనిక పాలనలో ఉన్న మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని ఆమె చేసిన వ్యక్తిగత పోరాటం ఆమెకు, అణచివేత ముంగిట శాంతియుతంగా పోరాడుతున్న అంతర్జాతీయ వ్యక్తిగా గుర్తింపు తెచ్చి పెట్టింది. మయన్మార్‌ను కొన్ని దశాబ్దాల పాటు పాలించిన కఠినమైన సైనికాధికారులను అంగ్ సాన్ సూకీ సవాల్ చేశారు. ఆమె దీర్ఘ కాలం హౌస్‌ అరెస్ట్ లోనే ఉన్నారు. సూకీ 1989 – 2010 వరకు నిర్బంధంలోనే గడిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement