Tuesday, November 26, 2024

చెప్పుడు మాటలు విని నా పేరు హోల్డ్ లో పెట్టారు – జ‌బ‌ర్థ‌స్త్ అప్పారావు

క‌రోనా కార‌ణంగా నా ఏజ్ ని దృష్టిలో పెట్టుకుని జ‌బ‌ర్థ‌స్త్ లో కొంత‌కాలం వ‌ద్ద‌న్నార‌ని..ఆ త‌ర్వాత త‌న‌ని పిల‌వ‌లేద‌ని చెప్పారు జ‌బ‌ర్థ‌స్త్ అప్పారావు. ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. నేను బుల్లెట్ భాస్కర్ టీమ్ లో ఎన్నో స్కిట్లు చేశాను. ఏడెనిమిదేళ్లు నాన్ స్టాప్ గా షూటింగులో పాల్గొంటూ వెళ్లాను. ఎక్కడ కూడా ఎలాంటి రిమార్క్ లేదు. చెప్పుడు మాటలు విని నా పేరు హోల్డ్ లో పెట్టారు. స్కిట్స్ లో అంతగా ప్రాధాన్యత లేని పాత్రలు చేయమన్నా చేశాను. అక్కడ నా మర్యాద తగ్గుతున్నట్టు అనిపించింది. అది అవమానంగా .. బాధగా అనిపించింది. అందువలన తప్పుకోక తప్పలేదు. ‘కామెడీ స్టార్స్’లో డబుల్ పేమెంట్ ఇస్తున్నారు .. ఇప్పుడు నా పరిస్థితి బాగుంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement