తిరుపతి ప్రసాదాన్ని ప్లాస్టిక్ కవర్లలో అందించే బదులుగా ..వాతావరణంలో కలిసిపోయే బయోడిగ్రేబుల్ కవర్లను తయారు చేసేందుకు డీఆర్‌డీవో చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఆ సంస్థ చైర్మన్ సతీశ్‌రెడ్డి. తిరుమలలో ప్లాస్టిక్ నిరోధానికి డీఆర్డీవో తనవంతు కృషి చేస్తుందన్నారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి తో కలసి లడ్డూ ప్రసాద కౌంటర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్నదానం ప్లేట్లు, సత్రాల్లో ఇచే కప్పులు, గ్లాసులు బయోడిగ్రెబుల్ ఉండే కవర్ల రూపకల్పనలో నిమగ్నమై ఉన్నామని చెప్పారు. వీటిని తిరుమలలో కూడా వాడకం అయ్యేలా తీర్చిదిద్దుతామన్నారు.
తిరుమలలో ప్లాస్టిక్ నిరోధానికి నా వంతు కృషి చేస్తా – డీఆర్‌డీవో సంస్థ చైర్మన్ సతీశ్‌రెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement