Friday, November 22, 2024

మేడారం జాత‌ర‌కు త‌ప్ప‌కుండా రావాలే.. సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం

వనదేవతలను కొలుచుకునే ఏకైక పండుగ మేడారం జాతర.. సమ్మక్క, సారలమ్మ జాతరకు తప్పకుండా రావాలే అని సీఎం కేసీఆర్​కు మంత్రులు అల్లోల, సత్యవతి, ఎర్రబెల్లి కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 16 నుంచి షురూ అవుతోందని.. ఇప్పటికే భక్తులు వేలాది వస్తున్నారని తెలిపారు. మంగళవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్​ను గిరిజన, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కలిశారు.

సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు షురూ అయ్యాయి. తెలంగాణలోనే కాకుండా, పొరుగు రాష్ట్రాల్లోనూ ఈ జాతరకు ఎంతో గుర్తింపు ఉంది. ఏపీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి కూడా మేడారం జాతరకు భక్తులు తరలివస్తారు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement