హస్తం పార్టీ అధికారంలోకి రాబోతుం దా..? కర్నాటక మంత్రం తెలం గాణలో పనిచేసేనా..? కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరిగేనా.. లేదా చీలేనా..? ఇవన్నీ ప్రస్తుతం రాజ కీయ వర్గాల్లోనే కాదు.. రాష్ట్రం లోని ప్రజానీకం జోరుగా చర్చించు కునే అంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ సైతం గెలుపు ధీమాతో ఉంది. ఆ దిశగానే వడివడిగా అడుగులు వేస్తోంది. మరో వైపు హస్తం గెలుపు కు గండికొట్టేలా మజ్లిస్ పార్టీ పకడ్బందీ వ్యూహాలతో బరి లోకి దిగబోతోంది. తెలంగాణలో అధికారంలోకి రావా లంటే 60 స్థానాలు గెలవాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ 40కి పైగా స్థానాల్లో గెలుపు లెక్కలు పక్కాగా వేసుకుంది. ఆ 40 స్థానాలపై పతంగి పార్టీ నజర్ పెట్టింది. ఆ స్థానాల్లో మైనా రిటీ ఓటర్లు ఎక్కువగా ఉండటం గెలుపుకు కలిసి వస్తుందని భావిస్తోంది. ఇప్పటికే ఆయా సెగ్మెంట్‌లను ఎంపిక చేసు కుంది. క్షేత్రస్థాయి పర్యటనలను చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే గంప గుత్తుగా మైనార్టీ ఓటర్లు హస్తం వైపు మళ్లితే తప్ప గెలుపు సులువు కాదు. ఇప్పుడు ఎంఐఎం బరిలోకి దిగబోతుండటంతో అభ్యర్థుల గెలుపు కష్టతరంగా మారే అవకాశం ఉంది. మజ్లిస్ పార్టీ తాము పోటీ చేయబోయే స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్, ఆంధ్రప్రభ:
ముస్లిం మంత్రం
మైనారిటీ ఓటర్లు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ వస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడం, త్రిపుల్ తలాక్ లాంటి అంశాలతో కొంత మహిళా ఓటర్లు కమలం వైపు మళ్లారు. తెలంగాణలో నాటి టీఆర్‌ఎస్ పార్టీ మెజార్టీ ముస్ల్లిం ఓట్లు రాబట్టడంలో సక్సెస్ అయ్యింది. ఇక పాతబస్తీలో ఎంఐఎం తిరుగులేని శక్తిగా నిలుస్తూ వస్తోంది. 2004 నుంచి పాతబస్తీకే పరిమితమైన మజ్లిస్.. రాష్ట్రంలో విస్తరించేందుకు ప్రతి ఎన్నికల్లో ప్రయ త్నిస్తున్నా ముందడుగు వేయలేకపోయింది. ఈ ఎన్నికల్లో తమకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్న ఎంఐఎం 40 స్థానాల వరకు పోటీ చేసేందుకు మొగ్గు చూపిస్తోంది. ఆ సెగ్మెంట్‌లన్నీ కూడా కాంగ్రెస్‌కు అవకాశం ఉన్నవే కావడంతో ఇరు పార్టీలో చర్చ సాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థులకు పడే మైనారిటీ ఓట్లను ఎంఐఎం గండికొడితే గెలవడం కన్నా.. ఓడిపోయే అవకా శాలే ఎక్కువగా ఉన్నాయి. మరికొన్ని చోట్ల డిపాజిట్లు దక్కే పరిస్థితి కూడా ఉండదని లెక్కలతో సహా ఇరు పార్టీలో చర్చించుకుంటున్నారు.
ఓటు బ్యాంకుపై నజర్
మైనారిటీల సొంత పార్టీగా ముద్ర పడిన ఎంఐఎం ఓటు బ్యాంకు చీల కుండా జాగ్రత్త పడుతోంది. గెలిచినా, ఓడినా సంబంధం లేకుండా కొన్ని స్థానాల్లో పోటీ చేయనుంది. తమ సామాజిక వర్గం ఓట్లు పతంగికి ఉన్నా యని చాటి చెప్పే ప్రయత్నాన్ని ముమ్మరం చేసింది. ముస్ల్లింలను ఆకట్టుకునేందుకు కొన్ని ఎత్తుగడలను సిద్ధం చేసింది. ఎన్నికల అస్త్రాలను మరికొద్ది రోజుల్లో మజ్లిస్ సీనియర్ నేతలు ప్రయోగించబోతున్నారు. ఇవెె కాకుండా వారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలిచేందుకు, సమస్యలపై పోరాడేందుకు ఎంఐఎం నేతలు ముందుంటున్నారు. ఇలాంటి అంశాలు పతంగికి కలిసి రానున్నాయి. మజ్లిస్ పోటీ చేసే స్థానాల్లో పోరు రసవత్తరంగా సాగే ఛాన్స్ ఉంది. గట్టి పోటీని ఇవ్వడమే కాకుండా విమర్శల దాడితో రణక్షేత్రంగా పరిస్థితులు మారనున్నాయి.
ఆ జిల్లాలే టార్గెట్
ముస్లిం మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్న తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పోటీ చేయను న్నట్లుగా ప్రకటిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల్లోనే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని చూస్తోంది. బోధన్, నిర్మల్, ముథోల్, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్, జహీరా బాద్, అంబర్‌పేట్, రాజేంద్రనగర్, షాద్‌నగర్ స్థానాల్లో పక్కాగా పోటీకి దిగబోతున్నారు. కరీంనగర్, భువనగిరి, వరంగల్ ఈస్ట్ లాంటి స్థానాల్లోనూ పోటీకి సిద్ధపడు తున్నా.. అప్పటి పరిస్థితులను బట్టి బరిలోకి దిగే అవకాశా లున్నాయి. ఎప్పటి లాగే 7 స్థానాలు పక్కాగా గెలిచే అవ కాశం ఉంది. ఈ ఎన్నికల్లో డబుల్ డిజిట్‌కు చేరుకునే అవ కాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పటి నుంచో సీట్లను పెంచు కోవాలని భావిస్తున్న మజ్లిస్ వచ్చే ఎలక్షన్స్‌లో ఆ కలను నెరవేర్చుకునేందుకు తీవ్రంగా శ్రమించబోతుంది.