పేరు మార్చుకుని హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడో ముస్లిం యువకుడు. గుడిలో పెళ్లితంతు ముగిసిన తర్వాత ఆ యువతి అత్తారింటికి వెళ్లగా అతను ముస్లిం అని తెలిసింది. దీంతో షాక్‌కి గురయ్యింది ఆ పెళ్లి కూతురు.
ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో నివసిస్తున్న ఓ హిందూ యువతిని ముస్లిం వ్యక్తి దేవాలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. తాను హిందువునని చెప్పి, ఆ యువతిని మోసం చేశాడు. పెళ్లి తర్వాత అతడిని కలిసేందుకు ఇంటికి వెళ్లగా అసలు విషయం ఆ అమ్మాయికి తెలిసింది. ఆ వ్యక్తి కూలీగా పనిచేసే నిర్మాణ స్థలంలో వారిద్దరూ కలుసుకున్నారు.
అతను తనను తాను రవీంద్ర అని పరిచయం చేసుకున్నాడు.. కానీ, అతని పేరు షాజాద్ అన్సారీ అని ఆ తర్వాత తేలింది. ఈ జంట ఆరు నెలలుగా సహజీవనం చేస్తుండగా, ఈ మధ్యనే పెళ్లి అయ్యింది. అసలు విషయం బయటకు రావడంతో ఆ వ్యక్తి పరారీలో ఉన్నాడు. దీంతో తనకు న్యాయం చేయాలని ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. మోసం చేసి పెళ్లి చేసుకున్న వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి.