Friday, November 22, 2024

ట్విట్టర్ డీల్ పక్కన పెట్టిన మస్క్.. ఈ వార్త రాగానే కుప్పకూలిన ట్విట్టర్ షేర్లు!

ట్విట్టర్ కు అమెరికా కుబేరుడు ఎలాన్ మస్క్ షాకిచ్చారు. ట్విట్టర్ ను కొనుగోలు చేయాలనుకున్న డీల్ ను ప్ర‌స్తుతానికి పక్కన పెట్టిన‌ట్టు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్పామ్, ఫేక్ అకౌంట్లకు సంబంధించిన వివరాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని అందుకే డీల్ ను హోల్డ్ లో పెడుతున్నానని ఎలాన్ మ‌స్క్‌ తెలిపారు. కాగా, మొత్తం అకౌంట్లలో వీటి సంఖ్య 5 శాతం కంటే తక్కువగానే ఉంటుందని ట్విట్టర్ చెపుతోంది. అయితే ఈ లెక్క తేల్చాలని, పక్కా వివరాలను అందించాలని మస్క్ డిమాండ్ చేశారు. ఈ వివరాలు అందేంత వరకు డీల్ ను హోల్డ్ లో ఉంచుతున్నట్టు చెప్పారు. మస్క్ ఈ ప్రకటన చేసిన వెంటనే ట్విట్టర్ షేర్ల విలువ ఏకంగా 20శాతం పడిపోయింది. 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ ను మస్క్ కొనుగోలు చేయాలనుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement