ఎక్కడికి వెళ్లినా లిప్ట్ ఎక్కడం అలవాటుగా మారింది. మెట్లు ఎక్కడమే మానేశారు జనాలు. మాల్స్ లలో అయితే ఎస్కలేటర్లని వినియోగిస్తున్నారు. అయితే కేరళ కొచ్చిలోని ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ లో మాత్రం లిప్ట్ గానీ ఎక్కలేటర్ కానీ ఎక్కమంటున్నారట ప్రయాణికులు. ఎందుకనుకుంటున్నారా. మెట్లని ఎక్కెటప్పుడు, దిగేటప్పుడు వినసొంపైన మ్యూజిక్ వినిపిస్తుందట. దాంతో మెట్ల మీద వెళ్లుతుంటే సప్తస్వరాలు పలుకుతున్నాయి. ఒక్కో మెట్టుకి ఒక్కో స్వరం పలికేలా అధికారులు ఏర్పాట్లు చేయడం విశేషం. దాంతో ఎంజీ రోడ్డు మెట్రో స్టేషన్ లోని పియానో మెట్లని ఎక్కి దిగేందుకు ప్రయాణికులు సుముఖతని వ్యక్తం చేస్తున్నారట. కాగా ఈ మ్యూజికల్ స్టెప్స్ కంప్యూటర్ తో డిజైన్ చేశారు. మెట్టుమీద అడుగు వేసినప్పుడు లైటింగ్ తో పాటు స్వరం వినిపించేలా ఏర్పాటు చేశారు. ఈ మ్యూజికల్ మెట్లను ట్రాయాక్సియా ఇన్ఫోటెక్ సంస్థ ఇంజనీర్లు రూపొందించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..