Friday, November 22, 2024

Breaking: యువతిని చంపి.. ఫ్రిజ్ లో పెట్టి..

మనుషులు మానవత్వాన్ని మర్చిపోతున్నారు. తాము మనుషులమనే విషయాన్ని పట్టించుకోవడం లేదు. జంతువుల్లా ప్రవర్థిస్తున్నారు. మనుషులను చంపి రక్తం తాగడం, గుప్తనిధుల కోసం బలి ఇవ్వడం.. ఆస్తి తగాదాల్లో తలలు నరకడం లాంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా.. ఓ దుర్మార్గుడు యువతిని చంపి ఫ్రిజ్ లో పెట్టిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని నజఫ్ గడ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. యువతిని అత్యంత కిరాతకంగా చంపడమే కాకుండా.. ఆ శవాన్ని ఫ్రిజ్ లో పెట్టిన నిందితుడు సాహిల్ గెహ్లాట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement