రియాల్టీ షో బిగ్‌బాస్ లో ఇవ్వాల ఎలిమినేషన్ జరిగింది. ‘బిగ్‌బాస్ నాన్ స్టాప్’ గత నెల 26న ప్రారంభమై ప్రేక్షకాధరణ పొందుతోంది. అయితే ఈసారి గతంలో మాదిరిగా కాకుండా పాత కంటెస్టెంట్స్ ని వారియర్స్‌గా.. కొత్తవారిని చాలెంజర్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈసారి నామినేషన్ల పర్వం కొనసాగగా.. మొదటివారం ఎలిమినేషన్ లో మిత్రశర్మ, ఆర్జే చైతు, నటరాజ్ మాస్టర్, అరియానా, సరయు, హమీదా, ముమైత్ ఖాన్ ఉన్నారు. చాలామంది మిత్రశర్మ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుందని భావించారు. అయితే అనూహ్యంగా ముమైత్‌ఖాన్ హౌస్ నుంచి బయటకు వచ్చింది.
కాగా ఫస్ట్ వీక్ ఎలిమినేషన్లో సరయు, ముమైత్ ఖాన్ చివరి వరకు మిగిలారు. ముమైత్ కు ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు రావడంతో షో నుంచి ఆమె ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఎలిమినేషన్ సమయంలో నవ్వుతూ కనిపించిన ఈ డ్యాన్సర్ స్టేజీ మీదకు రాగానే కన్నీటిపర్యంతమైంది. ‘మొదటి బిగ్ బాస్ సీజన్లో పడిన మార్క్‌ను తొలిగించుకునేందుకు ఇక్కడ అడుగుపెట్టాను. ఇప్పుడు ఇంత త్వరగా బయటకు వెళ్లాల్సి వస్తుందని అనుకోలేదు. ఎంతో బాధగా ఉంది. నన్ను కావాలనే బ్యాడ్ చేశారు.. బయటకు కూడా అలానే చూపించారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ముమైత్.