Tuesday, November 26, 2024

ముంబై బోణీ..

కోల్‌కతాతో జరిగిన రెండో టీ20లో ముంబయి ఇండియన్స్‌ ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా 20 ఓవర్లలో 142/7 స్కోరుకే పరిమితమైంది. దీంతో ముంబయి ఇండియన్స్‌ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్‌లో కోల్‌కతా విజయానికి 15 పరుగులు అవసరమైన వేళ బౌల్ట్‌ నాలుగు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. దాంతో రోహిత్‌ టీమ్‌ ఈ సీజన్‌లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతకుముందు రాహుల్‌ చాహర్‌ 4/27 నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. కాగా, తొలుత కేకేఆర్‌కు లభించిన ఆరంభం చూస్తే మోర్గాన్‌ టీమ్‌ సునాయాసంగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ, కీలక సమయంలో ముంబయి బౌలర్లు వికెట్లు తీయడంతో కోల్‌కతా ఊహించని ఓటమి చవిచూసింది. ఆఖర్లో కృనాల్‌ పాండ్య, బుమ్రా, బౌల్ట్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించారు.

అంతకుముందు సూర్య కుమార్‌ యాదవ్‌(56: 36 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకానికి తోడు రోహిత్‌ శర్మ(43: 32 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌) రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. ఆండ్రీ రస్సెల్‌(5/15) ఐదు వికెట్లతో విజృంభించగా పాట్‌ కమిన్స్‌(2/24) రెండు వికెట్లు పడగొట్టాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement