ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో అమెరికా డాలర్లని స్వాధీనం చేసుకున్నారు ముంబై కస్టమ్స్ అధికారులు. ముంబై లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ.4.1 కోట్ల విలువైన 4,97,000 డాలర్లను స్వాధీనం చేసుకున్నారు.పక్కా సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ దుబాయ్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులను అడ్డుకున్నారు. వారి బ్యాగేజీని పరిశీలించగా, చీరలు, పాదరక్షలు, బ్యాగ్‌లో దాచిన 4,97,000 డాలర్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి స్థానిక కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారి తెలిపారు. పట్టుబడిన కరెన్సీ విలువ మన దేశంలో (భారతీయ కరెన్సీలో) దాదాపు 4.1 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ముంబయి విమానాశ్రయంలో రూ.4.1 కోట్ల విలువైన 4,97,000 డాలర్లు..ముగ్గురి అరెస్ట్
Advertisement
తాజా వార్తలు
Advertisement