Friday, November 22, 2024

ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఏసీ రైళ్ల‌లో 50 శాతం టిక్కెట్ ధ‌ర త‌గ్గింపు!

దేశవ్యాప్తంగా పెట్రో, డీజిల్, గ్యాస్ సహా నిత్యావ‌స‌ర ధ‌ర‌లు పెరిగిపోతున్న వేళ.. రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ముంబై లోక‌ల్ ఏసీ రైళ్ల‌లో ధ‌ర‌ల‌ను 50 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ముంబైలో ఎయిర్ కండిషన్డ్ లోకల్ రైళ్ల ఛార్జీలను 50 శాతం తగ్గిస్తున్నట్లు కేంద్ర మంత్రి రావుసాహెబ్ దాన్వే శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం 5 కిలోమీటర్ల దూరానికి రూ.65గా ఉన్న కనీస ఛార్జీని రూ.30కి తగ్గించనున్నట్లు దాన్వే తెలిపారు.

మహారాష్ట్ర ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో బైకుల్లా రైల్వే స్టేషన్ పునరుద్ధరణ హెరిటేజ్ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా రైల్వే శాఖ సహాయ మంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. ముంబైలో ఎయిర్ కండిషన్డ్ లోకల్ రైళ్ల ఛార్జీలను తగ్గించాలన్నది ప్రజల చిరకాల డిమాండ్ అని, ప్రస్తుత ఛార్జీలను కనీసం 20-30 శాతం తగ్గించాలని తమకు సూచనలు అందాయని మంత్రి పేర్కొన్నారు. అయితే ధరల సవరణ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో దాన్వే పేర్కొనలేదు. కాగా, ప్రతిరోజూ ముంబై సెంట్రల్, వెస్ట్రన్ రైల్వే రెండింటిలోనూ దాదాపు 80 ఎయిర్ కండిషన్ లోకల్ ట్రైన్ సర్వీసులు సేవలు అందిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement