Saturday, November 23, 2024

చెన్నై విమానాశ్ర‌యంలో మ‌ల్టీప్లెక్స్..

చెన్నై విమానాశ్ర‌యంలో ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి వ‌చ్చింది దేశంలోనే మొట్టమొదటి మల్టీప్లెక్స్ థియేట‌ర్. కాగా ఎయిర్‌పోర్ట్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు పివిఆర్ సినిమాస్ ప్రకటించింది. PVR సినిమాస్ తన కొత్త ఏరోహబ్ మల్టీప్లెక్స్‌ను చెన్నైలో ప్రారంభించింది, ఇది చెన్నై విమానాశ్రయంలో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన భారతదేశపు మొట్టమొదటి మల్టీప్లెక్స్ ఈ ఏరో హబ్. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలోని విమానాశ్రయ సముదాయంలో ఉన్న ఈ కొత్త మల్టీప్లెక్స్‌లో ఐదు స్క్రీన్స్ ఉంటాయి. మొత్తం1,155 మంది కూర్చునేలా సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. విమానాశ్రయానికి వచ్చే, బయలుదేరే ప్రయాణీకులకు విమాన సేవలు ఆలస్యం అయినా, వెయిటింగ్ సమయం లో వారికీ ఎంటర్టైన్మెంట్ అందించడమే కాకుండా, ఎయిర్‌హబ్ నివాసితులు మరియు విమానాశ్రయం చుట్టూ ఉన్న సాధారణ పరిసరాల్లోని సందర్శకులకు కూడా ఈ మల్టీప్లెక్స్ అందుబాటులో ఉంటుంది. ఈ సినిమా థియేటర్ 2k RGB+ లేజర్ ప్రొజెక్టర్లు, క్రిస్టల్ క్లియర్, రేజర్-షార్ప్, అల్ట్రా-బ్రైట్ పిక్చర్‌ల కోసం RealD 3D డిజిటల్ స్టీరియోస్కోపిక్ ప్రొజెక్షన్, అడ్వాన్స్‌డ్ డాల్బీ అట్మాస్ హై-డెఫినిషన్‌తో సహా అత్యాధునిక సినిమాటిక్ టెక్నాలజీలను కలిగి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement