Thursday, November 21, 2024

కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి ‘ముకుల్ వాస్నిక్’ పేరు – సాయంత్రం స‌మావేశం

ఐదు రాష్ట్రాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయింది కాంగ్రెస్ పార్టీ. ఐదు రాష్ట్రాల ఫ‌లితాలు ప‌లువురి నేత‌ల‌తో పాటు కార్య‌క‌ర్త‌ల‌ను అసంతృప్తికి గురి చేశాయి. ఉత్తర్ ప్రదేశ్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విసృత్తంగా ప్రచారం చేసినా… 403 స్థానాలకు కేవలం ఒకే స్థానాన్ని దక్కించుకుంది. ఇక గెలిచే అవకాశం ఉన్న పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో నాయకులు సమర్థవంతంగా పనిచేయలేదని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. పంజాబ్ లో కాంగ్రెస్ సీఎం చన్నీతో పాటు పీసీసీ ప్రెసిడెంట్ సిద్దూ కూడా ఓడిపోవడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. జీ 23 గా పిలువబడుతున్న సీనియర్ నేతలు ఇప్పటికే సమావేశం అయ్యారు. అయితే తాజాగా వారు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ‘ ముకుల్ వాస్నిక్’ ని నియమించాలని సలహా ఇస్తున్నారు. ఏం జ‌రుగుతుందో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement