రిలయన్స్ జియో.. ఈ నెట్వర్క్ ఇప్పుడు అన్నిటినీ కాదని దేశంలో టాప్ లెవల్‌కి చేరింది. వచ్చిన కొత్తలో ఉచితం అంటూ ఎడాపెడా డేటా అందించిన రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ.. యూజర్లు పెరిగిన తర్వాత పెద్దమొత్తంలో డబ్బుల దండకం మొదలెట్టేశాడు. అయితే.. డేటా వాడకానికి అలవాటు పడ్డ జనం కక్కలేక, మింగలేక అన్నట్టు అదే నెట్‌వర్క్‌లో ఉండిపోవాల్సి వచ్చింది. ఇక ఆకర్షణీయమైన ప్లాన్లతో ఇతర నెట్‌వర్క్‌ల నుంచి పెద్ద ఎత్తున మొవైల్ నెంబర్ పోర్టబులిటీ (ఎంఎన్‌పీ) ద్వారా యూజర్లను రాబట్టుకున్నారు.
అయితే.. ఇప్పుడు తన నెట్వర్క్ లో తలెత్తుతున్న ఇబ్బందులు, గ్లిట్జ్ కారణంగా చాలామంది మళ్లీ ఇతర నెట్‌వర్క్‌లకు జారుకుంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడప్పుడు ఛీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటుంది రిలయన్స్. అయితే ఈ మధ్య ముఖేష్ అంబాని ఓ చెత్త స్ట్రాటజీని అవలంభించడాన్ని యూజర్లు ఛీ కొడుతున్నారు. కొంతమంది ప్రత్యేక వినియోగదారులకు 100GB హై స్పీడ్ ఇంటర్నెట్ ఫ్రీగా ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే.. ఇది అందరికీ కాకుండా.. జియో స్మార్ట్ LTE ల్యాప్‌టాప్ కొనుగోలు చేసిన కొంతమందికే అందించనున్నట్టు తెలుస్తోంది. ఈ ఛీప్ బిజినెస్ ట్రిక్ తెలియక చాలామంది రిలయన్స్ ఉచ్చులో చిక్కుకుని ఆ తర్వాత ఆఫర్ వర్తించదని తెలియడంతో పెదవి విరుస్తున్నారు.
జియో హెచ్‌పి స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్ ఆఫర్ అందరికీ వర్తించదు. దీని ప్రయోజనం కొంతమంది హెచ్‌పి ల్యాప్‌టాప్‌ల వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందాలంటే కొత్త HP LTP ల్యాప్‌టాప్‌ని కొనుగోలు చేసి ఉండాలి. అయితే.. ఇది కూడా రిలయన్స్ డిజిటల్లో ఆన్లైన్ కానీ, ఆఫ్‌లైన్‌లో కానీ, JioMart వెబ్సైట్ నుంచి కానీ కొనుగోలు చేసి ఉంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుందని కొత్త మెలిక పెట్టడంతో యూజర్లు ఛీ పో.. అంటూ తిట్టుకుంటున్నారు.