దివాళీ నుంచి జియో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేశ్ అంబానీ ఈ ప్రకటన చేశారు. దివాళీ నాటికి నాలుగు నగరాల నుంచి 5జీ సేవల్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. డిసెంబర్ 23వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు. జియో ద్వారా డిజిటల్ కనెక్టివిటీ పెరుగుతోందని, ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో జియో దూసుకువెళ్తోందని, 5జీతో సుమారు వంద మిలియన్ల ఇండ్లను కనెక్ట్ అవుతామని ముకేశ్ తెలిపారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలో తొలుత జియో 5జీ సేవలు ప్రారంభంకానున్నాయని ఆయన తెలిపారు. మేడిన్ ఇండియా 5జీ నెట్ వర్క్ వినియోగంలోకి తెచ్చేందుకు మెటా, గూగుల్,మైక్రోసాఫ్ట్, ఎరిక్సిన్, నోకియా, శాంసంగ్, సిస్కో, క్వాల్కంతో భాగస్వామ్యం అవుతున్నట్లు చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement