బ్రెజిల్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. రియో డీ జెనీరోపై కురిసిన భారీ వర్షాలకు 14 మంది మృతి చెందారు. గత రెండురోలుగా కుంభవృష్టి కురుస్తుండటంతో వరదలు పోటెత్తాయి. దీంతో కొండచరియలు విరిగిపడంతో 14 మంది మంది మృతిచెందారు. కుండపోత వర్షాల కారణంగా బ్రెజిల్‌లోని రియో డి జెనీరో రాష్ట్రం అంతటా ఆకస్మిక వరదలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడి ఎనిమిది మంది పిల్లలతో సహా 14 మంది మరణించారు. మరో ఐదుగురు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. వానలు ఇంకా తగ్గకపోవడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. వరదల ప్రభావిత ప్రాంతాలలో 144 మందిని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. భారీ వరదల ధాటికి ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడడంతో తల్లి సహా ఎనిమిది చిన్నారులు సజీవ సమాధి అయ్యారని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement