మన ఇండియాలో ఎక్కడ చూసినా చెత్త చెదారం ఏదో ఒక చోట కనిపిస్తూనే ఉంటుంది. అయితే మున్సిపాలిటీలు అంతగా పట్టించుకోవు. కానీ విదేశాల్లో ఇలాంటి విషయాల్లో చాలా కఠినాతి కఠినంగా వ్యవహరిస్తుంటారు. అందుకే ఖాళీ అట్టపెట్టె బయటపెట్టినందుకు ఏకంగా రూ. 40వేల ఫైన్ విధించారంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ అదే జరిగింది బ్రిటన్ లో. ఓ 69 ఏళ్ల ముసలామె పామెలా హోమ్స్… తన ఇంటి ముందు ఓ పెద్ద ఖాళీ అట్టపెట్టెను ఉంచింది. దాని వల్ల ఎవరికీ ఎలాంటి ఆపదా లేదు.కానీ స్థానిక కౌన్సిల్… పామెలాకి… ఓ ఫైన్ రసీదు ఇచ్చారు. ఆ బిల్లు ఏంటంటే ఇంటి బయట ఖాళీ అట్టపెట్టెను ఉంచినందుకు 400 పౌండ్లు (రూ.40,000) చెల్లించాలని ఆదేశించారు .వాతావరణం చల్లగా ఉండటంతో… ఆమె హాట్ టబ్ లిడ్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వగా… ఆ వస్తువు ఆ అట్టపెట్టెలో వచ్చింది..
వస్తువును తీసుకున్న ఆమె… అట్టపెట్టెను బయట ఉంచింది. తన కొడుకు వచ్చి దాన్ని తీసుకువెళ్లతాడనుకుంది. కానీ ఆమె కొడుకు దాన్ని తీసుకెళ్లలేదు. మర్చిపోయాడు. ఆ రాత్రి పోలీసులు అలా జీపులో తిరుగుతూ ఆ అట్టపెట్టెను చూశారు. చిత్రమేంటంటే… పామెలా కొనుక్కున్న హాట్ టబ్ లిడ్ ఖరీదు కంటే… ఈ ఫైనే ఎక్కువ ఉంది. తాను ఆ ఫైన్ చెల్లించే పరిస్థితుల్లో లేనంటోంది పెద్దావిడ. అధికారులు ఇంతలా ఫైన్ వెయ్యడానికి బలమైన కారణం ఉంది… బ్రిటన్లో చెత్తని ఎక్కడబడితే అక్కడ వెయ్యకూడదు. అలా వేస్తే… పక్కింటి వాళ్లను ఇబ్బంది పెట్టినట్లే అవుతుంది. వాళ్లు కంప్లైంట్ ఇవ్వొచ్చు. దీన్ని అక్కడ ఫ్లై-టిప్పింగ్) అంటారు. అలాంటి కంప్లైంట్ రావడం వల్లే తాము ఈ చర్య తీసుకున్నామని అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..