హైదరాబాద్: బిఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, పర్యావరణం, అడవులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మెంబర్ జోగినపల్లి సంతోష్ కుమార్ ఇటీవల మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వైల్డ్‌లైఫ్ శాంక్చురీలో పర్యటించారు. ఆయన పర్యటన విశేషాలను మహారాష్ట్ర అటవీ అధికారులు మ్యాజికల్ మెల్ఘాట్ ట్విట్టర్ పేజీ ద్వారా పంచుకున్నారు. ఎంపీ సంతోష్ తీసిన జంతువులు, పక్షుల ఫోటోలను కూడా అందులో జతచేశారు. తన పర్యటనలో తిప్పేశ్వర్ అటవీ అందాలను, విభిన్నజంతు సంపదను కెమెరా ద్వారా బంధించిన ఎంపీ సంతోష్ కి మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్యటనలో మెల్ఘాట్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ జయోతి బెనర్జీ, తిప్పేశ్వర్ డీఎఫ్ఓ కిరణ్ జగ్తప్ మర్యాదపూర్వకంగా ఎంపీ సంతోష్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల వెంట అటవీ రక్షణ, పులుల సంచారంపై చర్చించారు. అడవులు, పర్యావరణ రక్షణకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని, గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా దేశవ్యాప్తంగా చేపట్టిన స్ఫూర్తివంతమైన పనులను వివరాలను మహారాష్ట్ర అధికారులకు ఎంపీ వివరించారు. తన పర్యటనకు సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు.
తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో పర్యటించిన ఎంపి సంతోష్ కుమార్
Advertisement
తాజా వార్తలు
Advertisement