Tuesday, November 26, 2024

అంబేద్క‌ర్ ఆశ‌యంలో భాగ‌మే హ‌రిత‌హారం – ఎంపి సంతోష్ కుమార్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక ‘హరితహారం’ ప్రాజెక్టు రాజ్యాగం నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాల్లో భాగమేనని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ హితం నినాదంతో 30 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రారంభించిన ఈ ప్రతి ష్టాత్మక కార్యక్రమం ఇప్పటికే ఎనిమిది విడతలు పూర్త య్యింది. ఈ ఏడాది జూన్‌లో 9వ విడతకు అధికార యం త్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా చేయాలన్న లక్ష్యంతోనే ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ నినాదంతో మరో అడుగు ముందుకు వేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. 2015 జూలై 3న చిలుకూరు బాలాజీ టెంపుల్‌ వద్ద ప్రారంభమైన హరితహారం కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది.

బీఅర్‌ అంబేద్కర్‌ ఆశయాలను అమలు చేయడంలో దేశం లోనే ముందున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. నన్ను కలవా లంటే ఒక మొక్కను నాటండి ఇది దాదాపు ఏడు దశాబ్దాల క్రితం డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ నినాదం. దీన్ని అందిపుచ్చుకుని దేశ వ్యాప్తం చేసిన ఏ-కై-క వ్యక్తి కేసీఆర్‌. ఆదేశించిండే తడువుగా.. కర్త, ఖర్మ, క్రియ అన్నీ తానై ఆచరణకు శ్రీకారం చుట్టి ఫలితం సాదించడంలో సక్సెస్‌ అయ్యారు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌. ఇప్పుడు దేశంలో ఏ కార్యం జరిగినా.. ముందు మొక్క నాటే కార్యక్రమంతోనే ప్రారంభించడం ఆనవాయితీగా మార్చే స్థాయికి ఫలితం సాధించగలిగారు.

మనుషుల్లో సమానత్వం, ప్రకృతి సమతుల్యత రెండూ ఉండాలని నాడు భావించారు రాజ్యాంగ నిర్మాత. అందుకే ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తనను కలవాలనుకునే వారు ఒక మొక్కను నాటిన తర్వాతే రావాలని పిలుపునివ్వడం ఆయన ముందుచూపు, దార్శనికతకు అద్దం పడుతోంది. మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాల పట్ల దూరదృష్టికి ఇదొక మచ్చుతునక. అయితే, కాలక్రమంలో ఈ నినాదాన్ని అందరూ మరిచిపోయారు. కేసిఆర్‌ నేతృత్వం లోని తెలంగాణ ప్రభుత్వంలో ఎంపీ సంతోష్‌ కుమార్‌ ద్వారా ఇప్పుడది బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. మనం మన రాజ్యాంగాన్ని ఎలాగైతే మార్గదర్శకంగా భావిస్తున్నామో, అలాగే అంబేద్కర్‌ గారు చెప్పిన మొక్కలను నాటాలనే స్పూర్తిని గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ద్వారా కొనసాగించాలని కేసిఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హుస్సేన్‌ సాగర్‌ ఒడ్డున, అంబేద్కర్‌ గారి జయంతి పురస్కరించుకొని.. ప్రగతిశీలతకు నిలువెత్తు నిదర్శనమైన బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ గారి 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడంతో నిత్యం ఆయన నినాదం గుర్తుకు రానున్నది. ఈ సందర్భంలో ప్రతీ ఒక్కరు అంబేద్కర్‌ ఆశయాన్ని కొనసాగిస్తూ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో భాగంగా ఒక్కో మొక్కను నాటాలని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement