Friday, November 22, 2024

జంగిల్ బచావో- జంగిల్ బడావో.. నేడు ప్రపంచ అటవీ దినోత్సవం

హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో ప్రపంచ అటవీ దినోత్సవ ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ పి.నవీన్ రావు, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. కేబీఆర్ పార్క్ లో చీఫ్ జస్టిస్, అతిథులు మొక్కలు నాటారు. పార్క్ ఖాళీ స్థలంలో మర్రి మొక్కను చీఫ్ జస్టిస్ నాటగా.. నేరేడు మొక్కను జస్టిస్ నవీన్ రావు, వేప మొక్కను ఎంపీ సంతోష్ కుమార్ నాటారు.

తెలంగాణకు హరితహారం ద్వారా జంగిల్ బచావో- జంగిల్ బడావో నినాదంతో చేపట్టిన కార్యక్రమాలను చీఫ్ జస్టిస్ కు అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్.ఎం. డోబ్రియాల్ వివరించారు. పార్క్ లో చీఫ్ జస్టిస్, అతిథులు వాకింగ్ చేశారు. ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు చాలా బాగున్నాయని చీఫ్ జస్టిస్ అన్నారు.

సంతోష్ కుమార్ మాట్లాడుతూ అందరికీ ప్రపంచ అటవీ దినోత్సవ శభాకాంక్షలు తెలిపారు. గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పులను ఎదుర్కోవడానికి విరివిగా మొక్కలు నాటడమే మార్గం అని అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా సమాజంలో ప్రతి ఒక్కరూ మూడు పీ -పార్టిసిపేట్, ప్లాంట్, ప్రొటక్ట్ లను విధిగా అనుసరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement