Friday, November 8, 2024

అసెంబ్లీ బ‌రిలోకి సై అంటున్న ఎంపీలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రధాన ప్రతినిధి: అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి(భారాస)తో సహా రాష్ట్రంలోని ఆయా లోక్‌సభ నియోజక వర్గాలకు ప్రాతినిధ్యం వహి స్తున్న ముఖ్య నేతలు ఈ దఫా అసెంబ్లీ బరిలో నిలిచేం దుకు రంగం సిద్ధం చేసుకుంటు-న్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భాజపా చీఫ్‌ బండి సంజయ్‌ కూడా శాసన సభకు పోటీ- చేసి తమ అదృష్టాన్ని పరీక్షిం చుకునేందుకు సిద్ధమైనట్టు- తెలుస్తోంది. ఎంపీలుగా కొనసాగుతున్న ఒకరిద్దరు భారాస నేతలు ఎమ్మెల్యేలుగా పోటీ- చేస్తున్నామని ఇప్పటికే ప్రకటించగా, కొందరు ఎమ్మెల్యేలను వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ-లో పెట్టేందుకు భారాస అధినేత కేసీఆర్‌ సంకల్పిం చినట్టు- తెలుస్తోంది. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లలో తరచూ పర్యటిస్తూ అక్కడి ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని ఆయన సదరు నేతలకు సూచించినట్టు- సమా చారం. లోక్‌సభ ఎన్నికల్లో ఈ దఫా ఐదారుమంది కొత్త వారిని ఎంపిక చేయాలన్న నిర్ణయానికి కేసీఆర్‌ వచ్చినట్టు- కూడా ప్రచారం జరుగుతోంది. తెరాస పేరు మార్చి జాతీయ స్థాయిలో భారాసను ఏర్పాటు- చేసిన నేపథ్యంలో పార్టీని అన్ని రాష్ట్రాల్లో భారీగా విస్తరించేం దుకు ప్రణాళికలు రూపొందిస్తోన్న కేసీఆర్‌ ఆంగ్ల, హిందీ భాషల్లో బాగా పట్టు-న్న వారిని ఎంపీ అభ్యర్థు లుగా నిలబెట్టి వారి సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు- చెబుతున్నారు. ఇందులో భాగంగా ఆయా పార్టీల ముఖ్యులను, నేత లను తరుచూ కలుస్తూ సమస్యలపై పోరాడే వారిని లోక్‌సభ అభ్యర్థులుగా ఖరారు చేయాలన్న పట్టు-దలతో ఉన్నట్టు- సమాచారం. రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజక వర్గాలుండగా ఇందులో తొమ్మిది సెగ్మెంట్లలో భారాస ఎంపీలున్నారు. భాజపా నుంచి నలుగురు, కాంగ్రెస్‌ తరపున ముగ్గురు, ఎంఐఎం నుంచి ఒకరు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఎమ్మెల్యే పదవులను ఆశిస్తున్నవారు వీరే!
లోక్‌సభ సభ్యులుగా ఉంటూ శాసనసభకు పోటీ- చేయాలన్న ఉత్సాహంతో ఆయా పార్టీల నేతలున్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన కొడంగల్‌ అసెంబ్లీ బరిలో నిలవనుండగా.. భాజపా చీఫ్‌, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ వేములవాడ అసెంబ్లీకి పోటీ- చేయాలని నిర్ణయించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరు శాసనసభకు పోటీ- చేసి ఓటమి పాలవ్వగా ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ- చేసి గెలిచారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తన అసెంబ్లీ నియోజకవర్గం హుజూర్‌నగర్‌ బరిలో నిలవనున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి గెలిచిన ఉత్తమ్‌ ఆ తర్వాత పార్టీ అధిష్టానం ఆదేశంతో నల్గొండ ఎంపీ బరిలో నిలిచి విజయం సాధించారు. ఈ దఫా నల్గొండ లోక్‌సభ నుంచి పార్టీ సీనియర్‌ నేత మాజీ మంత్రి జానారెడ్డిని నిలబెట్టి ఆయన తనయుడు రఘువీర్‌కు నాగార్జున సాగర్‌ అసెంబ్లీ స్థానానికి పోటీ- చేయించే ఆలోచనతో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నట్టు- చెబుతున్నారు.

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ-కి దిగుతున్నట్టు- ప్రకటించారు. కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ వేములవాడ అసెంబ్లీ బరిలో నిలిచేందుకు సమాయత్తమవుతున్నారు.
నాగర్‌కర్నూలు ఎంపీగా ఉన్న మాజీ మంత్రి పోతుగంటి రాములు అచ్చంపేట అసెంబ్లీ స్థానానికి భారాస తరపున పోటీ- చేయాలని నిర్ణయించారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజుని నాగర్‌ కర్నూలు లోక్‌సభకు పోటీ-కి పెట్టే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ అభ్య ర్థిగా మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని పోటీ-కి పెట్టాలని అధినేత కేసీఆర్‌ యోచిస్తున్నట్టు- సమా చారం. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక అసెంబ్లీ స్థానానికి పోటీ- చేయడం దాదాపు ఖరారైం దన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మహబూబా బాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత అదే నియోజక వర్గ ఎమ్మె ల్యేగా పోటీ- చేయనున్నట్టు- సమాచారం. భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ భారాసకు రాజీనామా చేసి భాజపాలో చేరడంతో అక్కడ ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై కేసీఆర్‌ దృష్టి సారిం చినట్టు- చెబుతున్నారు. ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేసిన డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ను ఇక్కడి నుంచి పోటీ- చేయించాలన్న ఆలోచనతో కేసీఆర్‌ ఉన్నట్టు- సమాచారం. సికిం ద్రాబాద్‌ లోక్‌సభకు ప్రస్తుతం నగరంలో ఉన్న సీనియర్‌ ఎమ్మెల్యేల్లో ఒకరిని ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతుండగా మంత్రి తలసాని తనయుడు సాయికిరణ్‌కే పోటీ-కి అవకాశం ఇవ్వనున్నట్టు- చెబుతున్నారు. నల్గొండ లోక్‌సభకు శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి పేరును ప్రతిపాదించే అవకాశం ఉన్నట్టు- తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement