ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాల విషయంలో జల జగడం నడుస్తున్న నేపథ్యంలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్‌కు మరో లేఖ రాశారు. నవసూచనల పేరుతో ఆయన శుక్రవారం నాడు రాసిన నాలుగో లేఖలో జలజగడం అంశాన్ని ప్రస్తావించారు. నీటి పంపకాల విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరుపై సరికాదని ఎంపీ రఘురామ అభిప్రాయపడ్డారు. రాజకీయ అవసరాల కోసం ఇరు రాష్ట్రాల సీఎంలు ఉద్దేశపూర్వకంగా ఈ గొడవలు పెంచకూడదని ఆయన హితవు పలికారు.
నదీ జలాల విషయంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇరు రాష్ట్రాల ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగించాలని, దీంతో ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చని జగన్ అన్నారని, మరి జల వివాదాలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని రఘురామ నిలదీశారు. తెలంగాణలోని ఆంధ్రా వారి గురించి జగన్ వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. నీటి వివాదంపై ప్రధాని మోదీకి జగన్ లేఖలు రాయడం వల్ల సత్వర పరిష్కారం ఉండదన్న సంగతి జగన్‌కు కూడా తెలుసన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు తక్షణమే సమావేశమై చర్చలు జరిపి నీటి వివాదాలను పరిష్కరించాలని ఆయన కోరారు.
ఇది కూడా చదవండి: త్వరలోనే ఏపీ సీఎం జగన్‌పై రాబోతున్న బయోపిక్