మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఇంటి ముందు హనుమాన్ చాలీసాను పఠిస్తామన్న కేసులో సినీనటి, ఎంపీ నవనీత్ కౌర్ ను, ఆమె భర్త రవి రాణాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొద్దిసేపటి క్రితం ముంబైలోని బైకుల్లా జైలు నుంచి ఎంపీ నవనీత్ కౌర్ విడుదలయ్యారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టగా… కోర్టు వీరికి రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో వీరు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను విచారించిన ముంబైలోని కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో నవనీత్ కౌర్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆమె భర్త కాసేపట్లో విడుదల కానున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement