ఆయన ధర్మపురి కాదు ..ఆధర్మపురి అని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. వారం రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని బాండ్ పేపర్ పై రాసిచ్చారని… మూడేళ్లయినా పసుపుబోర్డు రాలేదన్నారు. మోసం చేసిన ఆయనను ఎక్కడికక్కడ రైతులు అడ్డుకుంటారని చెప్పారు. ఈ మూడేళ్లలో పార్లమెంటులో పసుపు బోర్డు కోసం అరవింద్ ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు. కేంద్రం నుంచి ఆయన తెచ్చిన నిధులు కూడా ఏమీ లేవని… తాను ఎంపీగా ఉన్నప్పుడు పసుపు బోర్డు కోసం ఎంతో ప్రయత్నించానని… ప్రధాని మోడీని, అప్పటి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కూడా కలిశానని… అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు. అరవింద్ కు తాము ఇప్పటికే మూడేళ్ల సమయం ఇచ్చామని… ఇకపై ఉపేక్షించబోమని కవిత హెచ్చరించారు. బీజేపీ శ్రేణులు తమపై దాడులకు పాల్పడాలని చూస్తే ఊరుకోబోమన్నారు.
ధర్మపురా ..ఆధర్మపురా ఎంపీపై – నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ కవిత
Advertisement
తాజా వార్తలు
Advertisement