లాక్‌డౌన్ సమయంలో కొందరు కలెక్టర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రెండు రోజుల క్రితమే చత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో ఓ యువకుడి స్మార్ట్‌ఫోను తీసుకుని దాన్ని ధ్వంసం చేసిన ఓ కలెక్టర్ అనంతరం అతడి చెంపఛెళ్లుమనిపించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కలెక్టర్‌పై వేటు పడింది. ఆయన స్థానంలో మరొకరిని నూతన కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. లాక్‌డౌన్ సమయంలో చెప్పుల షాప్ నిర్వహిస్తున్న ఓ యువకుడిపై షాజాపూర్ అదనపు కలెక్టర్ మంజూషా విక్రంత్‌రాయ్ చేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు చిక్కింది. ఆమె తీరుపై తమకు సమాచారం అందిందని ఆ రాష్ట్ర మంత్రి ఇందర్‌సింగ్ పర్మార్ తెలిపారు. దర్యాప్తు జరిపి అవసరమైతే ఆమెపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement