మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో 72వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందుల ఆర్ అండ్ బీ అతిథి గృహంలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అధికారులు విచారించారు. ఈ కేసులో భాస్కర్‌రెడ్డి కీలక అనుమానితుడిగా ఉన్నారు. కడప జైలులో విచారణకు జగదీశ్వర్‌రెడ్డి, భరత్‌కుమార్ హాజరయ్యారు.
మరోవైపు వివేకా హత్య కేసులో కీలక నిందితుడు సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు పది రోజుల పాటు విచారించారు. ఇవాళ్టితో కస్టడీ ముగియడంతో అతన్ని కడప కేంద్ర కారాగారం నుంచి పులివెందులకి తీసుకెళ్లారు. సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 6వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. పలు వస్తువులు అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పదిరోజుల విచారణలో సీబీఐ కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: టీ20 వరల్డ్ కప్.. పాక్ తో భారత్ మ్యాచ్ ఎప్పుడంటే..