Sunday, November 24, 2024

ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పెంపుపై – హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్వ‌ర్వులు

ఏపీ హైకోర్టు సినిమా టికెట్ల ధ‌ర‌ల పెంపుపై మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. టికెట్ ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. లైసెన్సింగ్ అథారిటీ (జేసీ)కి ప్రభుత్వం తమ అభిప్రాయాన్ని మాత్రమే తెలియజేయగలదని పేర్కొంది. టికెట్ ధరలను అంతిమంగా నిర్ణయించేది మాత్రం లైసెన్సింగ్ అథారిటీయేనని తేల్చి చెప్పింది. ఆన్‌లైన్‌లో టికెట్లను విక్రయించే సమయంలో సర్వీసు చార్జీలను టికెట్ ధరల్లో కలపడానికి వీల్లేదని చెప్పింది. గతంలో విక్రయించినట్టుగానే పాత విధానంలోనే మల్టీప్లెక్స్‌లు టికెట్లను అమ్ముకోవచ్చని పేర్కొంటూ జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంలో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ జూన్ 15కు వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement