Tuesday, November 26, 2024

Spl Story: ఓటీటీల్లో బెస్ట్ మూవీ.. 200 హ‌ల్లా హో!

ఒక‌ప్పుడు ఒక మూవీ ఓటీటీల్లోకి రావడానికి రెండు నెలలకు పైగానే పట్టేది. కరోనా వరుస లాక్ డౌన్ ల తర్వాత పరిస్థితిలు నార్మల్ అయ్యాయి. అయితే ఇప్పుడు సినిమాలు కూడా థియేటర్లలో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్నాయి. కానీ, కొన్ని సినిమాలు థియేటర్స్ తో పాటు ఓటీటీల్లో కూడా డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్నాయి. కొంతమంది నిర్మాతలు, డైరెక్టర్లు థియేటర్ల కంటే ఓటీటీల్లోనే రిలీజ్ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు..

దీంతో కొన్ని సినిమాలు రిలీజ్ అయిన రెండు మూడు వారాలకే ఓటీటీల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ కాంపిటేషన్ వల్ల కొన్ని ఓటీటీలకు ప్రిఫర్ చేస్తుంటే.. మరికొన్ని కొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్ కు వస్తన్నాయి. థియేటర్స్ లో ట్రెండ్ అయినట్టే మూవీస్ కి ఓటీటీలో కూడా మంచి అప్రిసియేషన్ లభిస్తోంది. మోర్ వ్యూయర్ షిప్ ని సొంతం చేసుకుని ట్రెండింగ్ గా మారుతున్నాయి.

ఈ మధ్య ఓటీటీల్లో ట్రెండింగ్ అవుతున్న బెస్ట్ మూవీ..
200 హల్లా హో.. ఈ సినిమా రియ‌ల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందించారు. మ‌హారాష్ట్ర నాగ్‌పూర్‌లో జ‌రిగిన కొన్ని ఘ‌ట‌న‌లే దీనికి ప్రేర‌ణ‌గా తీసుకున్నారు. 40 ఎఫ్ఐఆర్‌లున్న‌ బలి చౌదరిని కోర్టులో 200 మంది మహిళలు ముసుగులు ధరించి గుంపుగా వచ్చి కళ్లల్లో కారం చల్లుతారు. అతని బాడీ పార్ట్స్ కట్ చేసి చంపేస్తారు. దీనికి పోలీసులు ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ తో సినిమా ఉంటుంది.

ఈ ఇన్సిడెంట్ ఫిక్షన్ అనుకుంటారు కానీ.. ఇది రియల్ ఇన్సిడెంట్. నాగ్‌పూర్‌లో 2004లో నిజంగానే ఈ ఘ‌ట‌న జరిగింది. 15 సంవత్సరాల పాటు నాగ్‌పూర్‌లోని ఒక ఏరియాలో రాబరీ, గ్యాంగ్ రేప్స్, మర్డర్స్.. ఇంకా చాలా క్రిమినల్ యాక్టివిటీస్ చేసిన అప్పూ యాదవ్‌ని 200 మంది దళిత మహిళలు ఓపెన్ కోర్టులో చంపేస్తారు. అక్కడి మహిళలు ఫేస్ చేసిన ఇన్సిడెంట్ ని.. అప్పటి వరకు అణచివేతకు గురైన ఆ మ‌హిళ‌ల్లో ఎందుకు అలా మార్పు వచ్చిందన్నది మూవీలో చూపించారు. కోర్టు సీక్వెన్సెస్, అండ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేసే ఇన్వెస్టిగేషన్ చాలా బ్రిలియంట్ గా ఉంటుంది.

రిటైర్డ్ జడ్జ్ రోల్‌లో కనిపించిన అమోల్ పాలేకర్ చాలా నేచురల్‌గా ప‌ర్‌ఫెక్ట్‌గా యాక్ట్ చేశారు. అలాగే అంటాగనిస్ట్‌గా చేసిన ఫేమస్ యూట్యూబర్ సాహెల్ ఖత్తర్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మూవీ చూసిన తర్వాత నాగ్‌పూర్‌లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగాయా అని షాక్ అవుతాము. ఇప్పుడిది హిందీ వెర్షన్ తో పాటు తెలుగులోనూ జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement