Tuesday, November 19, 2024

వీర యోధులందరికీ సంతాపం : ప్ర‌ధాని మోడీ

డిసెంబరు 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వీర యోధులందరికీ సంతాపాన్ని తెలియజేస్తున్నానని.. జనరల్ బిపిన్ రావత్ మరణం ప్రతి దేశభక్తునికి తీరని లోటని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ బలరాంపూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ… జనరల్ బిపిన్ రావత్ ఎక్కడున్నా.. రాబోయే రోజుల్లో, భారతదేశం అభివృద్దిలో ముందుకు సాగడాన్ని ఆయన చూస్తారన్నారు. తమిళనాడు చాపర్ క్రాష్‌లో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఇతరులను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రమాదంలో మరణించిన వీర యోధులందరికీ భారతదేశం సంతాపం వ్యక్తం చేస్తోందని.. కానీ బాధలో ఉన్నప్పటికీ భారతదేశం అభివృద్ది ఆగదు, నిలిచిపోదన్నారు. బిపిన్ రావత్ ధైర్యవంతుడు, దేశం సాయుధ బలగాలను స్వావలంబనగా మార్చడానికి చాలా కష్టపడ్డాడని అన్నారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అతని ప్రాణాలు కాపాడాలని మాతా పటేశ్వరిని ప్రార్థిస్తున్నానని ప్రధాని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement