Sunday, November 17, 2024

బీజేపీకి రాజీనామా చేసిన మోత్కుపల్లి.. త్వరలో టీఆర్ఎస్‌లో చేరిక

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్తగా తీసుకొచ్చిన ‘దళిత సాధికారత పథకం'(దళిత బంధు) బీజేపీలో మోత్కుపల్లికి, ఆ పార్టీ నాయకత్వానికి మధ్య చిచ్చు పెట్టింది. పార్టీ ఆదేశాలను కాదని.. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరైనప్పటి నుంచి మోత్కుపల్లిని ఆ పార్టీ దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది. అందువల్లే బీజేపీకి రాజీనామా చేసినట్లు రాజీనామా లేఖలో మోత్కుపల్లి పేర్కొన్నారు. తనను ఒక్క మాట కూడా అడగకుండా ఈటెలను బీజేపీలో చేర్చుకోవడం తనను బాధించిందన్నారు. విలువల కోసం పనిచేసే తనను, తన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోలేదని బీజేపీపై మోత్కుపల్లి ఆరోపణలు చేశారు.

పేరుకు సీనియర్ నేత అయినా బీజేపీలో మోత్కుపల్లికి ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో మోత్కుపల్లి కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన బీజేపీని వీడినట్లు తెలుస్తోంది. త్వరలో మోత్కుపల్లి టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

ఈ వార్త కూడా చదవండి: మాన్సాస్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు

Advertisement

తాజా వార్తలు

Advertisement