రాజ్యంగం మార్చాలని వాజ్ పేయి కమిటీ వేశారు.. అది మీ బీజేపీ కాదా.. తల ఎక్కడ పెట్టుకుంటవ్ సంజయ్.. సీఎం కేసీఆర్ అంబేద్కర్ ను అవమానించలేదు.. అతని గురించి మాట కూడా మాట్లాడలేదు.. రాజ్యాంగంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. దానికే బట్టలు చింపుకుని బజారుకెక్కడ ఎందుకో అర్థం కావడం లేదు. అస్సలు అంబేద్కర్ విగ్రహాన్ని తాకే హక్కు కూడా మీకు లేదు..
సీఎం కేసీఆర్ ఏం అన్నాడని ప్రతిపక్షాలు బట్టలు చింపుకుంటున్నాయో అర్థం కావడం లేదని, బీజేపీ వాళ్లు అయితే బట్టలు చింపుకొని మాట్లాడుతున్నారని, రైతు చట్టాలపై మోడీ క్షమాపణ చెప్పినప్పుడే ప్రధానిగా ఉండే అర్హత కోల్పోయారన్నారు మాజీ మంత్రి, టీఆర్ ఎస్ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు. ఇవ్వాల మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను టచ్ చేశారు. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పిన రోజే మోడీ రాజీనామా చేయాల్సి ఉందని మండిపడ్డారు మోత్కుపల్లి.. సీఎం కేసీఆర్ రాష్ట్రాల హక్కులపై పోరాటం చేసే అవసరం ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
మోత్కుపల్లి నర్సింహులు మాటల్లోనే..
‘‘విభజన హామీలు ఎటు పోయాయి.. ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదు ఈ కేంద్ర ప్రభుత్వం. బయ్యారం హుక్కు ఫ్యాక్టరీ ఎటు పోయింది.. .రైలు కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడికి పోయిందో ఈ వెధవ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉందా లేదా.. నేషనల్ లెవల్ లో ఎదుగుతున్న సీఎం కేసీఆర్ తొక్కే ప్రయత్నాలు చేస్తోంది ఈ బీజేపీ. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నందున ఇవాళ నిధులు అన్ని కూడా మీరు పాలించే రాష్ట్రాలకి ఇస్తే పోరాటం చేయడం తప్పేంటి. తెలంగాణలో కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ ఇస్తే మీరు ఎందుకు ఇవ్వడం లేదు. దళిత బంధు ఇస్తున్న సీఎం కేసీఆర్ మీద విమర్శలు చేస్తుంటే మీరు ఎంత దుర్మార్గపు మనుషుల్లో అర్థం అవుతుంది. దళితుల మీద మీకు ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా ఎందుకు దళిత బంధు ఇవ్వడం లేదు.. ఇచ్చే దమ్ము మీకు ఉందా’’.. అని ప్రశ్నించారు నర్సింహులు.
‘‘దళితలకు న్యాయం చేసే దమ్ము దైర్యం మీకు ఉందా.. కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకుంటే కబర్దార్ మిస్టర్ బండి. నేను దళిత బంధు పోగ్రాంలో కూర్చుంటే ఎంతో సంతోషంగా ఉంది.. రేపటి బడ్జెట్ లో 20 వేల కోట్లు పెట్టబోతున్నారు సీఎం కేసీఆర్. దళితులను అవమాన పర్చే మీరు దళితలకు న్యాయం ఎక్కడ చేస్తారు. ఆదర్శవంతంగా పాలన చేస్తుంటే ఓర్వలేక పోతున్నారు. స్వాతంత్య్రం వచ్చినా 75 యేండ్లు గా మాకు సుఖం లేదు.. అంబేద్కర్ లేకపోతే దళిత జాతి లేదు.. ఈ రాజ్యాంగం వద్దు అనేది ఈ బీజేపీ పార్టీ… కరుడుగట్టిన బూర్జువా పార్టీ ఈ బిజెపి పార్టీ.. ఒక్కరోజు కూడా మతం గురించి మాట్లాడని రోజు ఉంటాదా… దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ మాటలు చర్చిస్తుంటే ఓర్వలేక ఈ అనవసర ఆరోపణలు. అంబేద్కర్ ను అవమానించారని అంటున్నారు ఈ బీజేపీ నాయకులు.. సీఎం కేసీఆర్ దళితుల పట్ల సానుకూలంగా ఉంన్నారు.. దళిత బంధు వంటి కార్యక్రమాలు నిర్వహించారు’’… అని మండిపడ్డారు మోత్కుపల్లి నర్సింహులు
‘‘దుర్మార్గపు పార్టీ ఈ బీజేపీ…ఆర్ ఎస్ ఎస్ చీఫ్ భగవత్ కూడా రాజ్యంలో మార్పులు చేయాలని అన్నారు. వాజపేయి ప్రభుత్వం రాజ్యాంగ మార్పుకోసం కమిటీ వేసింది.. అది మీ పార్టీ కాదా…ఎంతో మంది దేశాన్ని దోచుకున్న దోంగలను బయట దేశానికి పంపిస్తున్నారు.. ఇతర దేశాల్లో ఉన్న నల్లధనం తెచ్చి ప్రతి పేదవాడికి ఇస్తా అని మీ మోడీ అన్నాడు.. ఎంత మందికి ఇచ్చారు, మిస్టర్ బండి సంజయ్.. సిగ్గు ఉందా సంజయ్.. కేంద్రంలో అనేక ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి.. ఎందుకు ఉద్యోగుల నోటిఫికేషన్ ఇవ్వడం లేదు.. సంవత్సరానికి 2 కొట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఎవ్వి మరి ఉద్యోగాలు’’.. అని నిలదీశారు టీ ఆర్ఎస్ సీనియర్ నేత మోత్కుపల్లి. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ రాష్ట్రంలో లక్ష 35 వేల ఉద్యోగాలు ఇచ్చారు. రానున్న రోజుల్లో మరో 70 వేల ఉద్యోగాలు కల్పిస్తున్నారన్నారు.
ఇప్పటికే 105 సార్లు రాజ్యాంగ సవరణలు చేశారు. ఆనాడు అంబెద్కర్ కూడా చెప్పారు. అవసరమైతే రాజ్యాంగమే మార్చుకోవచ్చు అని. దళిత గిరిజన యువత ఎంతో ఆలోచన చేయాలి… అంబేద్కర్ గురించి సీఎం కేసీఆర్ ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు.. రాజ్యాంగం పై చర్చ జరగాలి అన్నారు. రాజ్యసభ దళితులకు రిజర్వేషన్లు లేవు.. ఆనాడు చదువుకోలేదు అని రిజర్వేషన్లు పెట్టలేదు… అందుకే సీఎం కేసీఆర్ రాజ్యంలో మార్పులు అన్నారు. జ్యూడిషియల్ డిపార్ట్మెంట్ లో కూడా రిజర్వేషన్లు లేవు. తెలంగాణ హైకోర్టు ఒక్క దళిత న్యాయమూర్తి లేడు. ఎందుకు లేడు మరి అర్థం చేసుకోవాలి. అణగారిన కులాల పట్ల ఇంకా వివక్ష ఉంది.. సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకి అంటున్నారు మరి మద్యం షాప్ లు,మెడికల్ షాప్ లు, ఇతర పరిశ్రమలో కూడా రిజర్వేషన్లు కల్పించారు. దళిత బంధు దేశవ్యాప్తంగా ప్రచారం జరిగితే ఈ ఆటలు సాగవు. దళిత బంధు, రైతు బంధు పై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి.. అందుకే ఈ బీజేపీ పార్టీ కి పుట్టగతులు ఉండవని ఈ ఆరోపణలు. పేదల ఖాతాలోకి నేరుగా పంపిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. హుజురాబాద్ లో ఇవాళ ఇంటింటా పండుగే….రేపటి బడ్జెట్ లో 20 కోట్లు కేటాయిస్తున్నారు. న్యాయ వ్యవస్థ లో కూడా రిజర్వేషన్లు పెట్టాల్సిన అవసరం ఉంది. సీఎం కేసీఆర్ మీద మాట్లాడే ఏ వ్యక్తి అయిన సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అని హెచ్చరించారు నర్సింహులు..
‘‘జై భీం అనే పదం మాట్లాడనికి మీకు హక్కు లేదు.. అంబేద్కర్ ను తాకే హక్కు లేదు. అంబెద్కర్ మహనీయులు ఆయనను తాకే హక్కు లేదు… అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మా జాతికి న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. పార్లమెంట్ లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది. ఆనాడు నీళ్ల కోసం పోతే కూడా అంటరాని వాళ్ళు ను హేళన చేశారు. కానీ, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇస్తున్న మహనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు పెట్టాల్సిన పని ఉంది. రాజ్యాంగంను పూర్తి గా మార్చాలని ఆనాడు వాజపేయి కమిటీ వేశాడు ఎక్కడ తలా పెట్టుకుంటావ్ మిస్టర్ సంజయ్.. మనుషులాగా పుట్టలేదు ..మీకు మాట్లాడే నైతిక హక్కు లేదని నేను అంటున్నాను. దండలు వేసుడు కాదు.. దళిత జాతికి ఏం చేశామో కావాలి. 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. నా జాతి కోసం నేను పని చేస్తున్న’’.. అని చెప్పుకొచ్చారు మోత్కుపల్లి నర్సింహులు..