Friday, November 22, 2024

‘మదర్ థెరిసా ఛారిటీ’ కోసం విదేశీ నిధుల లైసెన్స్ పున‌రుద్ధ‌ర‌ణ‌

విదేశాల నుంచి విరాళాల‌ను స్వీక‌రించేందుకు మ‌ద‌ర్ థెరిసా స్థాపించిన మిష‌న‌రీస్ ఆఫ్ ఛారిటీకి ఉన్న లైసెన్స్ గ‌డువు ఇటీవ‌ల ముగిసింది. దాంతో పున‌రుద్ధ‌ర‌ణ‌కు ద‌రఖాస్తు చేసుకోగా కొన్ని లోపాల‌ను స‌ర్కార్ గుర్తించింది. దాంతో వాటిని సరిదిద్ది , నిబంధ‌న‌ల మేర‌కు ద‌రఖాస్తు చేసుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం సూచించింది. దీనిపై ప్రతిపక్షాలు, పలు ఇతర వర్గాల నుంచి అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఎన్నో కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతుంద‌న్నారు.

సదరు చారిటీ తాజా దరఖాస్తుతో లైసెన్స్ ను పునరుద్ధరించింది. మిషనరీస్ ఆఫ్ చారిటీ నిర్వహిస్తున్న చిన్నారుల సంరక్షణ కేంద్రంలో మత మార్పిడులకు ప్రయత్నిస్తున్నట్టు గుజరాత్ లో ఒక పోలీసు కేసు నమోదు అయిన రెండు వారాల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. రెండు వారాల క్రితం సుమారు 6,000 సంస్థలకు సంబంధించి విదేశీ విరాళాల లైసెన్స్ గడువు తీరిపోయింది.ఈ మేర‌కు మదర్ థెరెసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీకి ఫారీన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీసీఆర్ఏ) కింద లైసెన్స్ ను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. దీంతో రెండు వారాలుగా నెలకొన్ని అనిశ్చితికి తెరపడింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement