Saturday, November 23, 2024

చిన్న ప్లాట్లనే ఎక్కువ‌ లైక్ చేస్తున్న‌రు.. ఉప్పల్​ భగాయత్​ ప్రి బిడ్‌కు గుడ్ రెస్పాన్స్‌..

ఉప్ప‌ల్ భ‌గాయ‌త్ ప్రిబిడ్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే చిన్న ప్లాట్ల‌వైపు చాలా మంది మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు మొగ్గు చూపుతుంటే.. పెద్ద ప్లాట్ల కొనుగోలు కోసం బడా బిల్డర్స్ ఎదురు చూస్తున్నారు. ఉప్ప‌ల్ భ‌గాయ‌త్‌లో మొత్తం 44 ప్లాట్లుంటే.. 1.35 లక్షల చదరపు గజాల స్థ‌లం ఉంది. రెసిడెన్షియల్ కోసం 21 ప్లాట్లు, మల్టీ పర్పస్ 15 ప్లాట్లు, షాపింగ్, ఎంటర్ టైన్మెంట్ కోసం 4 ప్లాట్లు, హాస్పిటళ్ల కోసం 2 ప్లాట్లు, ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ కోసం 2 ప్లాట్లు కేటాయించారు.

ఉప్పల్​ భగాయత్​ లే అవుట్​లో 44 ప్లాట్లను ఈ ఆక్షన్​ ద్వారా అమ్మకాలు జరిపే ప్రక్రియలో భాగంగా సోమవారం (15వ తేదీ) ఉప్పల్​ వెంచర్​లో హైదరాబాద్​ మెట్రో పాలిటన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ (హెచ్​ఎండిఏ) అధికారులు నిర్వహించిన ప్రీబిడ్​ సమావేశం విజయవంతంగా జరిగింది.

స్థానిక భూ వ్యాపారులతో పాటు బిల్డర్లు, డెవలపర్లు, కంపెనీలు, ఏజెన్సీల ప్రతినిధులు ప్రీబిడ్​ సమావేశానికి హాజరై నియమ నిబంధనలు, వారి సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. హెచ్​ఎండిఏ అధికారులు బి.ఎల్​.ఎన్​.రెడ్డి(చీఫ్​ఇంజినీర్​), కె.గంగాధర్​(ఎస్టేట్​ ఆఫీసర్​), సి.విజయలక్ష్మి(చీఫ్​ అకౌంట్స్​ ఆఫీసర్​), ఎం.రాంకిషన్​(ఓఎస్డీ), కె.గంగాధర్​(చీఫ్​ ప్లానింగ్​ ఆఫీసర్​), ప్రసూనాంబ(ల్యాండ్​ అక్విజేషన్​ ఆఫీసర్​) ఎంఎస్​టిసి అధికారులు ప్రీబిడ్​ మీటింగ్​లో సవివరంగా కొనుగోలుదారుల సందేహాలను నివృత్తి చేయడం, వాయిదాల చెల్లింపులు, రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై అధికారులు స్పష్టత ఇచ్చారు.

బ్యాంక్​ చార్జెస్​ కలుపుకుని ఈఎండి చెల్లించాల్సి ఉంటుందని, ఎలాంటి సందేహాలున్నా హెచ్​ఎండిఏ సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని సూచించారు. భారతదేశ పౌరులందరూ బిడ్డింగ్​లో పాల్గొనవచ్చని, దేశంలో నివసిస్తున్న ఇతర దేశస్తులకు అనుమతి ఉండదని తెలిపారు. ఇప్పటి వరకు రెండు దఫాలుగా జరిగిన ఉప్పల్​ భగాయత్​ ప్లాట్ల విక్రయాలకు అనూహ్యమైన స్పందన వచ్చిందని, ఈ సారి కూడా మంచి స్పందన కనబడుతుందని అధికారులు తెలియజేశారు.

జీహెచ్​ఎంసీ పరిధిలో దాదాపు 733 ఎకరాల విస్తీర్ణంలో 250 ఎకరాలతో మౌలిక వసతులు కలిగిన ఉప్పల్​ భగాయత్​ వెంచర్​ రానున్న రోజుల్లో హైదరాబాద్​కు తలమానికంగా నిలుస్తుందని వివరించారు.

- Advertisement -

విజయవాడ, వరంగల్​ జాతీయ రహదారులకు సమీపంలో క్లియర్​ టైటిల్స్​తో మధ్యతరగతి ప్రజలకు, సంపన్నులకు అందుబాటుకు వీలుగా 150 గంజాల నుంచి 5,000లకు పైగా గజాలు కలిగిన ప్లాట్లు కలిగి ఉండడం, ఇన్నర్​ రింగ్​ రోడ్డు, ఔటర్​ రింగ్​ రోడ్డులకు మధ్యలో ఉండడం, నాగోల్​–పీర్జాదిగూడ మద్య లింక్​ రోడ్డు అందుబాటులో ఉండడం, హాస్పటల్స్​, షాపింగ్​ కమ్​ ఎంటర్​ టైన్​ మెంట్​, మల్టీపర్పస్​ యూజ్​ కోసం ఇక్కడి స్థలాలు అందుబాటులో ఉండడం ఉప్పల్​ భగాయత్​ ప్రత్యేకతలుగా అధికారులు వివరించారు.

డిసెంబర్​ 2, 3 తేదీల్లో జరిగే ఆన్​ లైన్​ బిడ్డింగ్​ లో పాల్గొని ప్లాట్లను దక్కించుకున్న వారు 90 రోజుల్లో పూర్తి స్థాయి పేమెంట్​ చేసినట్లయితే ఆ తర్వాత పక్షం రోజుల్లో హెచ్​ఎండిఏ వారికి ప్లాట్​ రిజిస్ట్రేషన్​ చేస్తుందని చెప్పారు. కొనుగోలుదారులు ఫ్లాట్​ మొత్తం విలువలో 25 శాతం చెల్లింపులు జరిపితే మిగతా మొత్తం బ్యాంక్​ రుణంగా పొందే అవకాశం కూడా ఉందన్నారు. ఉప్పల్​ భగాయత్​ జిహెచ్​ఎంసీ పరిధిలో ఉన్నప్పటికీ భవన నిర్మాణ అనుమతులు హెచ్​ఎండిఏ మాత్రమే ఇస్తుందని స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement