Thursday, September 19, 2024

Exclusive – మొస్సాద్..మోస్ట్ డేంజరస్​!

అత్యంత శక్తివంతమైన ఇజ్రాయెల్​ గూఢచారి ఏజెన్సీ
గురితప్పని ‘మొస్సాద్‌’ సీక్రెట్ ఆపరేషన్లు
శత్రువుపైనే ఫోకస్.. ఏ కలుగులో దాక్కున్నా వ‌ద‌ల‌దు
శత్రువు స్థావరంలోనే ఆపరేషన్
టూత్ పేస్ట్ తో హైజాకర్ ఖతం
డెడ్ ఈజీగా హమాస్ హనియే సఫా
ఉరికంభానికి 33 మంది సిద్ధం
అయినా తొణకరు.. బెణకరు

( ఆంధ్రప్రభ స్మార్ట్, స్పెషల్ డెస్క్) – రెండు దేశాల మధ్య దొమ్మి కాస్త.. మూడో ప్రపంచ యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. దాయాది దేశాలు ఇరాన్ , హమాస్ నడుమ ఇజ్రాయేల్ జోక్యంతో.. అగ్రరాజ్యాలు ఇరుపక్షాలకు చేరుతున్న తరుణంలో.. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో తలదాచుకున్న హమాస్ నేత ఇస్మాయిల్ హనియే హతం.. ఈ ఘటనతో మొస్సాద్ పేరు ప్రపంచ గూఢచార్య వర్గాల్లో మార్మోగిపోతోంది. ఓర్నీ మొస్సాద్ అని నివ్వెరపోతున్నాయి. ఔను.. ఇజ్రాయేల్ అత్యంత శక్తిమంత ఆయుధం.. నిఘా, స్పెషల్ ఆపరేషన్ టీమ్, ఒక శత్రువును లక్ష్యం చేస్తే.. ఆ శత్రువు తుది ముట్టాల్సిందే. హిట్ లిస్టులోని శత్రువు భూ ప్రపంచంలో ఏ కలుగులో దాక్కున్నా.. వెతికి, వెతికి.. వేటాడి చంపడం మొస్సాద్ అసలు సిసలు పథకం. విషప్రయోగం.. బాంబులు, క్షిపణులతో శత్రువును మట్టుబెట్టటంలో ఆరితేరిన గూఢచార్య సంస్థే.. మొస్సాద్. సరీగా హమాస్ నేత ఇస్మాయీల్ హనియేను ఎంతో సులభంగా ఈ సంస్థ హతమార్చిన ఈ ఘటనతో నేడు ప్రపంచం ఆశ్చర్యపోలేదు. నివ్వెర పోలేదు. ఈ పని మొస్సాద్ కే సాధ్యమని గర్హిస్తోంది. మొస్సాద్ అప్రతిహాత హత్యాఘటనలెన్నో.. ఎన్నెన్నో… !

- Advertisement -

టూత్ పేస్ట్ తోనూ.. చంపేస్తారు
1978లో అఫ్ఘానిస్థాన్‌లోని బగ్దాద్‌లో వాదీ హదాద్‌ను మొస్సాద్ టీమ్ చంపిన వైనాన్ని ప్రపంచం ఇప్పటికీ మర్చిపోలేదు. ఇతడు ఓ హైజాకర్. లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా లక్ష్యంగా ఏర్పడిన పాపులర్ ఫ్రంట్ సంస్థకు చీఫ్. 1976లో టెల్ అవీవ్ విమానాశ్రయంలో ‘ఎయిర్ ఫ్రాన్స్’ విమానాన్ని హైజాక్ చేశాడు. లెఫ్టినెంట్ కల్నల్ యోనతాన్ నెతన్యాహు (ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సోదరుడు) నేతృత్వంలో థండర్ బోల్ట్ ఆపరేషన్ లో బందీలను విడిపించగలిగారు. ఈ పోరులో యోనతాన్ నెతన్యాహు వీరమరణం పొందారు. దాంతో ఇజ్రాయెల్ హిట్ లిస్ట్ లో వాదీ హదాద్ చేరాడు. బగ్దాద్ లో తలదాచుకున్నాడు. అంతే ఏజెంట్ సాడ్నెస్’ రంగంలోకి దిగాడు. వాదీ హదాద్ ఇంటిలో సర్వెంట్ గా చేరాడు. 1978 జనవరి 10న వాదీ హదాద్ వాడే టూత్ పేస్టును మార్చి ఇజ్రాయేల్ పాయిజన్డ్ టూత్ పేస్టును పెట్టాడు. ఆ పేస్టును వాడిన వాదీ ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. జర్మనీకి తరలించినా అక్కడి డాక్టర్లు బతికించలేకపోయారు. 1978 మార్చి 29న వాదీ చనిపోయాడు. అయితే 3 దశాబ్దాలు దాటే వరకు అతని మరణానికి పాయిజన్ టూత్ పేస్ట్ కారణమనే విషయం బయటి ప్రపంచానికి తెలియదు. పాలస్తీనా లిబరేషన్ కోసం ఖలీల్ మెషాల్ జోర్డాన్ లో తలదాచుకుంటూనే ఇజ్రాయేల్ పై చ దాడులకు వ్యూహాలను రచించాడు, అమలు చేశాడు. 1997లో మొస్సాద్ ఏజెంట్లు ఇతడి ఇజ్రాయేల్ లో చంపేందుకు స్కెచ్ వేశారు. ఖలీల్ చెవిలో విషాన్ని పిచికారీ చేశారు. ఇంకేముందీ ఖలీల్ కోమాలోకి వెళిపోయాడు. ఈ ఘటన అంతర్జాతీయంగా ఉద్రిక్తతలకు దారితీసింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ రంగంలోకి దిగారు. ఆయన ఒత్తిడితో ఇజ్రాయేల్ పంపిన విరుగుడు మందుతో ఖలీల్ బతికి బయటపడ్డాడు.

హిట్ లిస్టులో ..హనియే
గత ఏడాది అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. హమాస్ అగ్రనాయకులు కొందరు ఆ లైవ్ దృశ్యాలను చూస్తూ.. ‘థాంక్స్ గీవింగ్ ప్రార్థనలు నిర్వహించారు. అలా ప్రార్థనలు చేస్తున్న వీడియోలోని వారంతా ఇప్పుడు ఇజ్రాయేల్ హిట్ లిస్టులో ఉన్నారు. ఇస్మాయిల్ హనియే కూడా ఇజ్రాయేల్ హిట్ లిస్ట్ లోని శత్రవువే.

మొస్సాద్ అంతే,, అదరదు..బెదరదు
ఆపరేషన్ల సమయంలో మొస్సాద్ ఏజెంట్లు దేనికి భయపడరు. చిత్రహింసలనూ లెక్క చేయరు. పెదవి విప్పరు. నిజం చెప్పరు. చావుకు వెనకాడరు. అందుకే మొస్సాదీలు దొరికితే.. శత్రు దేశం.. వీరిని చంపదు. కేవలం కటకటాల్లో బంధీలుగా నిర్బంధిస్తుంది. ఇప్పటికి ఇరాన్ ఆధీనంలో ఇలా 20 మంది మొస్సాద్ ఏజెంట్లు చిక్కారని సమాచారం. తుర్కియేలోనూ 33 మంది ఏజెంట్లు చిక్కారు. గాజాలో సైనిక విభాగం -పొలిటికల్ బ్యూరో ఫాతిమా హమార్ సంధానకర్తగా ఉన్నారు. గాజాపై ఇజ్రాయేల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఆమె తుర్కియేలో తలదాచుకుంటున్నారు. ఫాతిమాను చంపేందుకు 50 మంది పైగా మొస్సాద్ ఏజెంట్లు తుర్కియేలో వేట ప్రారంభించారు. ఈ క్రమంలో 33 మంది ఏజెంట్లు దొరికిపోయారు. వీరిని తామే పట్టుకున్నట్టు తుర్కియే గత ఏడాది డిసెంబరులో ప్రకటించింది. గూఢచర్యం నేరం కింద వీరిని ఉరి తీస్తారని ప్రచారం తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement